Samantha: ‘చైతూ, శోభిత’ డేటింగ్ పై సమంత రియాక్షన్!

హీరో నాగచైతన్య , హీరోయిన్‌ శోభితా ధూళిపాలతో డేటింగ్‌ చేస్తున్నాడనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

  • Written By:
  • Updated On - June 21, 2022 / 12:53 PM IST

హీరో నాగచైతన్య , హీరోయిన్‌ శోభితా ధూళిపాలతో డేటింగ్‌ చేస్తున్నాడనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని నాగచైతన్య ఫ్యాన్స్‌ తిప్పి కొడుతూ..”చై ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయడానికే సమంత పీఆర్‌ టీమ్‌ ఇలాంటి రూమర్స్‌ సృష్టిస్తోంది” అని ట్వీట్స్‌ చేశారు. దీనిపై సమంత తనదైన శైలిలో స్పందించారు. ” అమ్మాయిలపై పుకార్లు వస్తే నిజమే.. కానీ అబ్బాయిలపై వస్తే మాత్రం అమ్మాయే చేయిస్తోందంటారు. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మీరు ప్రస్తావించిన వ్యక్తులు ముందుకెళ్లిపోతున్నారు. మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.  మీ పని మీద, మీ కుటుంబాల విషయాల మీద ఏకాగ్రత పెట్టండి” అని పేర్కొంటూ సమంత ట్వీట్‌ చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల కేఆర్‌కే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు సమంత వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన యశోదా, శాకుంతలం చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. మరోవైపు నాగచైతన్య హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’, లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ‘దూత’అనే వెబ్‌ సిరీస్‌ కూడా త్వరలోనే రిలీజ్‌ కానుంది.