Samantha on Nayantara: నయనతారపై సమంత సెన్సెషనల్ కామెంట్స్..అలా ఎవరు లేరట..!!

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 07:00 AM IST

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. పుష్పలో ఐటం సాంగ్ ద్వారా తన సత్తా చాటిన సమంత, ఇప్పుడు తమిళ్ లో KRK చిత్రంలో తళుక్కుమంది. అంతేకాదు ఈ సినిమాలో నయనతారతో కలిసి కామెడీ పండించింది.

కోలివుడ్ లో సమంతకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే, ఈ అమ్మడు అటు నయనతారతో కలిసి కేఆ‌ర్‌కే చిత్రంలో నటించడంతో అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఈ ఇద్ద‌రు కోలీవుడ్ భామ‌లు కాతువాకుల రెండు కాధ‌ల్ (క‌న్మ‌ణి రాంబో ఖ‌తిజా) సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి రొమాన్స్ చేయడం మరో అద్భుతం అనే చెప్పాలి. ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతోంది.

ఈ సంద‌ర్భంగా సామ్ ట్విట్ట‌ర్‌లో అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది. న‌య‌న‌తార గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ..’న‌య‌న‌తార‌లా ఎవ‌రూ ఉండ‌రు. నేను క‌లిసిన వ్య‌క్తుల్లో వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా, ఎంతో విధేయ‌త క‌లిగిన క‌ష్ట‌ప‌డే వ్య‌క్తుల్లో ఆమె ఒక‌రు’ అంటూ సామ్ స‌మాధాన‌మిచ్చింది

కేఆర్‌కే సినిమాలో సామ్‌, న‌య‌న‌తార, విజ‌య్ సేతుప‌తి కెమిస్ట్రీ బాగానే వ‌ర్క‌వుట్ అయింది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం స‌మంత గుణశేఖర్ దర్శకత్వంలోని శకుంతల సినిమాతో పాటు, య‌శోద‌ అనే మరో సినిమాలో నటిస్తోంది. అలాగే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి రొమాంటిక్ ల‌వ్ స్టోరీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంబంధించిన బర్త్ డే టీజర్ యూట్యూబ్ లో విడుదలైంది.