Site icon HashtagU Telugu

Saif Ali Khans Property : సైఫ్‌ అలీఖాన్‌కు మరో షాక్.. రూ.15వేల కోట్ల ఆస్తి ప్రభుత్వపరం ?

Saif Ali Khans Family Property Pataudi Family

Saif Ali Khans Property : ఇటీవలే దుండగుడి దాడిలో ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తీవ్ర గాయాలపాలయ్యారు. వాటి నుంచి పూర్తిగా కోలుకోక ముందే, ఆయనకు మరో షాక్ తగలబోతోంది.  సైఫ్ అలీఖాన్‌కు చెందిన పటౌడీ కుటుంబానికి రూ.15వేల కోట్లు విలువైన ఆస్తుల వ్యవహారంలో చుక్కెదురయ్యే అవకాశం ఉంది.

Also Read :Unique Railway Station: ఈ రైల్వేస్టేషన్‌లోకి వీసా లేకుండా వెళ్తే అరెస్ట్ ఖాయం

100 ఎకరాల భూమిపై వివాదం.. 

సైఫ్‌ అలీఖాన్‌.. నటుడు మాత్రమే కాదు. ఆయన పటౌడీ రాజ కుటుంబ వారసుడు కూడా. సైఫ్ తండ్రి పేరు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. మన్సూర్ అలీ 2011లో చనిపోయారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నవాబుగా సైఫ్‌ను ప్రకటించారు. అందుకే ప్రస్తుతం పటౌడీ కుటుంబానికి సైఫ్ వారసుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే భోపాల్‌లోని సైఫ్ కుటుంబానికి చెందిన ఆస్తుల వ్యవహారంలో ఎప్పటి నుంచో న్యాయ వివాదాలు నడుస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన దాదాపు 100 ఎకరాల భూమిలో దాదాపు లక్షన్నర మంది స్థానికులు ప్రస్తుతం నివసిస్తున్నారు. ఈ భూమిపై గత పదేళ్లుగా ‘ఎనిమీ ప్రాపర్టీ కేసు’ నడిచింది. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్-1968 ప్రకారం.. భారతదేశ విభజన తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన వారు భారత్‌లో వదిలిపెట్టిన ఆస్తులపై భారత ప్రభుత్వానికే హక్కు ఉంటుంది.  ఈ చట్టం ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తులను భారత ప్రభుత్వమే నియంత్రించాలి. పటౌడీ చివరి నవాబు పెద్ద కుమార్తె యువరాణి ఆబిదా సుల్తానా పాకిస్తాన్‌కు(Saif Ali Khans Property) వెళ్లిపోయారు. అందువల్ల నవాబు ఆస్తిని శత్రువు ఆస్తిగా(ఎనిమీ ప్రాపర్టీ) ప్రకటించారు. అయితే నవాబ్ మరణం తరువాత, అతని రెండో కుమార్తె మెహర్ తాజ్ సాజిదా సుల్తానా బేగం‌ను భోపాల్ వారసత్వ చట్టం 1947 ప్రకారం ఎస్టేట్‌కు వారసురాలిగా ప్రకటించారు.

Also Read :Trump Tower Hyderabad : త్వరలో హైదరాబాద్‌కు ట్రంప్ కుమారులు.. కారణం ఇదే

తమకూ హక్కు ఉందంటూ.. 

సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాకూర్‌ వంటివారు సాజిదా సుల్తానా బేగం‌ వారసులు. అందుకే ఆ 100 ఎకరాల ఆస్తిపై తమకూ హక్కు ఉందంటూ 2015లో వారు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆ 100 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియపై  హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను పదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు హైకోర్టు ఎత్తేసింది. ఆ ఆస్తిపై దావా వేయడానికి సైఫ్ కుటుంబానికి మధ్యప్రదేశ్ హైకోర్టు 30 రోజుల టైం ఇచ్చింది.  అయినా ఇప్పటికీ సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ దావా వేయలేదు.  దావా దాఖలు చేసే గడువు ముగిసిపోయింది. దీంతో తదుపరిగా ఏం జరగబోతోంది?  అనే దానిపై  ఉత్కంఠ నెలకొంది. ఈనేపథ్యంలో సైఫ్‌ కుటుంబానికి చెందిన దాదాపు రూ.15వేల కోట్లు విలువైన ఆస్తులను మధ్యప్రదేశ్‌‌లోని బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.