Bigg Boss Season 6: సూర్య ఆరోహిలది స్నేహం..ఇనయానే సూర్య వెంటపడుతోంది: బుజ్జిమా

ఆర్జే సూర్య.. ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆర్జే సూర్య బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా

  • Written By:
  • Updated On - October 15, 2022 / 04:30 PM IST

ఆర్జే సూర్య.. ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆర్జే సూర్య బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఆరో వారంలో కెప్టెన్ గా కూడా నిలిచాడు ఆర్జె సూర్య. అయితే సూర్య వ్యవహారం ఏంటి అన్నది ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటిలో సైలెంట్ గా ఉన్న ఆర్జే సూర్య ఆ తరువాత ఆరోహికి దగ్గర అయ్యాడు. దాంతో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని హోస్ట్ నాగార్జున తో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ బిగ్బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందే సూర్యకు బయట బుజ్జిమా అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు తెలిసింది.

హోస్ట్ నాగార్జున ఈ బుజ్జిమా ఎవరు అని అడగగా ఆర్జే సూర్య ముసి ముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడ్డాడు. అంతేకాకుండా పలుసార్లు బిగ్ బాస్ హౌస్ లో బుజ్జిమా పేరుని కూడా తలుచుకున్నాడు. అంతేకాకుండా ఈ వారం బ్యాటరీ రీఛార్జ్ అనే టాస్క్ లో భాగంగా సూర్యకు ఇంటి నుంచి వచ్చిన లెటర్ లో బుజ్జిమా పేరు కూడా వినిపించడంతో అసలు ఈ బుజ్జిమా ఎవరు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా బుజ్జిమా తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీబిజీగా ఉంది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సూర్యతో ఆమె పరిచయం అతని ప్రవర్తన అనేక అంశాల గురించి స్పందించింది.

ఇది బుజ్జిమా అసలు పేరు మృదుల. సూర్యకు ఆమెకు అయిదారేళ్ల నుంచి పరిచయం ఉందట. ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసస్తోందట. ఇంటర్వ్యూలో భాగంగానే ఆమె బిగ్బాస్ హౌస్ లో జరుగుతున్న విషయాలపై స్పందించింది. ఆరోహి సూర్యల మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని తెలిపింది. అనంతరం ఇనయ గురించి మాట్లాడుతూ..ఇనయానే సూర్య వెంటపడుతోంది అంటూ ఆమె కామెంట్స్ చేసింది. తనకు సూర్యకు పదేళ్ల క్రితం పరిచయం అయ్యిందని, ముందుగా ఆమె సూర్యకు మెసెంజర్ లో మెసేజ్ పెట్టగా, ఆపై ఏడాది తరువాత 2015 ఆగస్టులో వారిద్దరూ కలుసుకున్నారట. అప్పటినుంచి మా మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. సూర్య ముద్దుగా బుజ్జిమా అని పిలుస్తాడు.. కూడా అలాగే అని పిలుస్తాను అని చెప్పుకొచ్చింది మృదుల.