Bigg Boss 6: రేవంత్ వీడియోలు ఎందుకు చూపించరంటూ శివాలెత్తిన ఫైమా.. వీడియో వైరల్?

బిగ్ బాస్ సీజన్ 6 లో తాజాగా 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ వేడిగా సాగింది. హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ రేవంత్

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 03:10 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 లో తాజాగా 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ వేడిగా సాగింది. హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ రేవంత్ వర్సెస్ ఫైమా అన్నట్లుగా సాగాయి. పైమా రేవంత్ ని నామినేట్ చేయడంతో అసలు రచ్చ మొదలయ్యింది. అప్పుడు రేవంత్ వేరే వాళ్ల సపోర్ట్ లేనిదే నువ్వు గేమ్ ఆడ లేవు నువ్వు నాకు చెబుతున్నావు అని అనడంతో వెంటనే ఫైమా నేను సపోర్ట్ లేకుండా ఆడలేను అన్నావ్ మరి నువ్వు సపోర్ట్ లేకుండా ఆడావా అంటూ రేవంత్ కు దగ్గరగా వెళుతూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది.

అప్పుడు రేవంత్ నాకు వేలు చూపించి మాట్లాడకు హే వేలు చూపించి మాట్లాడకు అంటూ ఫైర్ అయ్యాడు. అయినా కూడా పైమా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇతరుల సపోర్ట్ తో ఆడిన రేవంత్ సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు అంటూ రేవంత్ నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మాటలు మారుస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడతాడు. ఇక్కడేమో కీర్తి నువ్వు సూపర్ ఆడతావు అంటాడు మళ్ళీ ఎక్కడికి వెళ్లి కీర్తి ఆడనే ఆడదని అంటాడు. ఇలా మాటలు మార్చే వ్యక్తి ఎవరికి కనిపించడం లేదా ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతాడు. ఏ రోజు ఆ పాయింట్ గురించి మాట్లాడరు.

మొదటినుంచి నోరు జారుతూనే ఉన్నాడు కానీ అవి ఎందుకు కనిపించడం లేదు ఎందుకు ఆ వీడియోలు చూపించడం లేదు అంటూ శివాలెత్తింది పైమా. మొత్తానికి రేవంత్ నోరు మూయించేది పైమా అన్నదే గత ఎపిసోడ్ తెలిసిపోయింది. హౌస్ లో వీరిద్దరిది ఒక ఎత్తు అయితే రేవంత్ అలాగే ఆదిరెడ్డిది మరొక ఎత్తు అని చెప్పవచ్చు. మొత్తానికి ఈసారి నామినేషన్ లో అందరూ కలిసి శ్రీ హాన్ ను ఎక్కువగా నామినేట్ చేసినట్టు తెలుస్తోంది.