Ram Charan Peddi : ఎన్టీఆర్ టైటిల్ తో చరణ్..?

చిత్రసీమలో ఓ హీరోకు అనుకున్న కథ మరో హీరో చేయడం..మరో హీరోకు అనుకున్న టైటిల్ ఓ హీరో చిత్రానికి ఫిక్స్ చేయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు ఇలా ఎన్నో జరిగాయి. తాజాగా ఎన్టీఆర్ (Jr NTR) చిత్రానికి అనుకున్న టైటిల్ ను రామ్ చరణ్ (Ram Charan)కు ఫిక్స్ చేయబోతున్నట్లు ఓ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. RRR తో ఆస్కార్ అవార్డు అందుకున్న ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు ప్రస్తుతం వారి వారి […]

Published By: HashtagU Telugu Desk
Rc16peddi

Rc16peddi

చిత్రసీమలో ఓ హీరోకు అనుకున్న కథ మరో హీరో చేయడం..మరో హీరోకు అనుకున్న టైటిల్ ఓ హీరో చిత్రానికి ఫిక్స్ చేయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు ఇలా ఎన్నో జరిగాయి. తాజాగా ఎన్టీఆర్ (Jr NTR) చిత్రానికి అనుకున్న టైటిల్ ను రామ్ చరణ్ (Ram Charan)కు ఫిక్స్ చేయబోతున్నట్లు ఓ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. RRR తో ఆస్కార్ అవార్డు అందుకున్న ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు ప్రస్తుతం వారి వారి సినిమాలతో బిజీ గా మారిపోయారు. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఎన్టీఆర్ ఇప్పటివరకు స్క్రీన్ ఫై కనిపించకపోయినా..చరణ్ మాత్రం పలు సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ ఛేంజర్’ (‘Game Changer’)మూవీ చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Buchhibabu) డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. శంకర్ మూవీ పూర్తి కాగానే బుచ్చిబాబు చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకరావాలని చరణ్ భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ‘పెద్ది’ (Peddi)అనే టైటిల్ ను అనుకుంటున్నారట మేకర్స్. ఈ టైటిల్ తోనే ఈ నెల 20 న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ టైటిల్ ను ఎన్టీఆర్ కోసం పెట్టుకున్నాడు బుచ్చిబాబు. చరణ్ కంటే ముందు ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడు. కానీ అది వర్క్ అవుట్ కాకపోవడం తో చరణ్ తో చేస్తున్నాడు. ఆలా ఎన్టీఆర్ టైటిల్ ను చరణ్ కు వాడబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇది నిజామా..కదా అనేది చూడాలి.

Read Also : Danam Nagender : దానం కూడా కాంగ్రెస్ గూటికేనా..?

  Last Updated: 15 Mar 2024, 03:15 PM IST