నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) పెళ్లి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఆమె తెలుగు హీరోతో ప్రేమలో ఉంది అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగు తారు కానీ అసలు విషయం దగ్గరకు వస్తే మాత్రం తూచ్ అనేస్తుంటారు. ఈమధ్య అటు ఆ హీరో ఇటు ఈ అమ్మడు ఇద్దరు దాదాపు ఓపెన్ అయినట్టే అనిపించింది.
ఇక లేటెస్ట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో నిర్మాత (Producer) సూర్యదేవర నాగవంశీ రష్మిక పేరు వినపడగానే ఆమె టాలీవుడ్ హీరోని పెళ్లాడుతుందని తెలుసు. కానీ అతనెవరో నాకు తెలియదు అని అన్నాడు. నాగ వంశీ ఈ కామెంట్స్ చూసి కొందరు నవ్వుకుంటున్నారు. టాలీవుడ్ హీరో అన్నప్పుడే అతనెవరు అన్నది అర్ధమైందని అంటున్నారు.
ఐతే ఇంత ఓపెన్ గా రష్మిక పెళ్లి (Marriage) గురించి మాట్లాడటం మాత్రం సర్ ప్రైజింగ్ గా ఉంది. మరోపక్క ఆ యువ హీరో నుంచి మాత్రం ఈ కామెంట్స్.. బయట జరుగుతున్న ఈ హంగామా గురించి ఎలాంటి టెన్షన్ లేదు. మరి వాళ్లిద్దరు సడెన్ గా ఏదో ఒకరోజు ఎంగేజ్మెంట్ తో దర్శనం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.
రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోయే ఆ టాలీవుడ్ హీరో ఎవరా అంటూ అందరు తెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐతే అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అని అందరికీ తెలిసిందే.