Rashmika Mandanna: ఫ్యాన్స్ అంటే రష్మిక ఎంత ప్రేమనో.. వైరల్ అవుతున్న వీడియో!

నేషనల్ క్రష్ రష్మిక తన అభిమానులపై ప్రేమను చాటుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

  • Written By:
  • Updated On - May 17, 2023 / 03:42 PM IST

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ హీరోగా తెరకెక్కుతున్న బేబీ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రష్మిక మందన్న హాజరయ్యారు. ఈ వెంట్ కు హాజరైన ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు చుట్టుముట్టారు. అయితే, ఆమె భద్రత సిబ్బంది అభిమానులను దూరంగా నెట్టేశారు. దీంతో రష్మిక వెంటనే సెక్యూరిటీ గార్డులను ఆపి వద్దని ‘అలా నెట్టేయకండి’ చెప్పింది. వెంటనే అక్కడున్న అభిమానులకు సెల్ఫీలు ఇచ్చింది రష్మిక.

వీడియోలో రష్మిక భారీ భద్రత మధ్య ఈవెంట్ కు రావడం, ఒక అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించడం చూడవచ్చు. అయితే రష్మిక అభిమానం కోసం నవ్వుతూ స్టిల్ ఇవ్వగా, ఆమె బాడీగార్డు ఆ వ్యక్తిని పట్టుకుని దూరంగా నెట్టాడు. వెంటనే బాడీగార్డ్ వైపు చూసి హెచ్చరించింది రష్మిక.  ఆ తర్వాత మరో అభిమాని తనతో సెల్ఫీ దిగేందుకు వెంబడించగా రష్మిక గమనించి వెంటనే సెల్ఫీ దిగి ఫొటోలకు ఫోజులు  కూడా ఇచ్చింది.  వారు ఫోటోలు తీస్తున్నప్పుడు  ‘ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్’ అని చెప్పడం చూడొచ్చు.

రష్మిక మందన్న ఎప్పటిలాగే ఎత్నిక్ డ్రెస్‌లో అందంగా కనిపించింది. ఆమె లేత గోధుమరంగు అనార్కలీ దుస్తులు ధరించి, దానికి సరిపోయే దుపట్టా, సాధారణ మేకప్ తో మేకప్ అభిమానులను ఫిదా చేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రాబోయే తెలుగు చిత్రం బేబీ నుండి ప్రేమిస్తున్న పాటను రష్మిక చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌తో పుష్ప 2: ది రూల్ మూవీలో నటిస్తోంది. ఇక నితిన్, దర్శకుడు వెంకీ కుడుములతో కూడా సినిమా తీయబోతోంది. దీనికి తాత్కాలికంగా VNRTrio అని పేరు పెట్టారు. బ్లాక్‌బస్టర్ చిత్రం భీష్మ తర్వాత ఈ జంట రెండోసారి కలుస్తోంది.

Also Read: Brazilian Teacher: విద్యార్థులతో టీచరమ్మా సెక్సీ డాన్సులు.. చక్కర్లు కొడుతున్న వీడియోలు!