Rashmika Mandanna : ఆ సినిమా కథ నచ్చకపోయినా చేసిందా.. రష్మిక ఈ కామెంట్స్ అందరు షాక్..!

కన్నడ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది. రీసెంట్ గా రిలీజైన యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక నెక్స్ట్ పుష్ప 2 తో మరోసారి హడావిడి చేయనుంది. దీనితో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు

Published By: HashtagU Telugu Desk
Rashmika Mandanna Dance for Thalapathi Ranjithame song at event Video Goes Viral

Rashmika Mandanna Dance for Thalapathi Ranjithame song at event Video Goes Viral

కన్నడ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది. రీసెంట్ గా రిలీజైన యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక నెక్స్ట్ పుష్ప 2 తో మరోసారి హడావిడి చేయనుంది. దీనితో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇదిలాఉంటే తన గురించి సోషల్ మీడియా ఎవరు ఏమన్నా సరే వెంటనే రియాక్ట్ అవుతుంది రష్మిక. ఈ క్రమంలో ఓ సినిమా కథ నచ్చకపోయినా సరే రష్మిక ఆ సినిమాలో నటించింది అంటూ ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు.

రష్మిక హీరోయిన్ గా శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా కథ నచ్చకపోయినా డైరెక్టర్ కిశోర్ తిరుమల, హీరో శర్వానంద్ మీద నమ్మకంతోనే రష్మిక ఆ సినిమా చేసిందని కామెంట్ చేశాడు ఒక నెటిజెన్. అయితే దీనికి వెంటనే స్పందించింది రష్మిక తను ఏ సినిమా అయినా కథ నచ్చబట్టే చేస్తానని అసలు ఇలాంటివన్నీ ఎలా పుట్టిస్తారో తెలియదని ఆన్సర్ ఇచ్చింది.

రష్మిక రెస్పాండ్ అయిన తీరు చూస్తుంటే కచ్చితంగా ఆమె ఆ సినిమా నచ్చే చేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంటుంది. ఈ ఇయర్ పుష్ప 2 తో మరోసారి అమ్మడు తన సత్తా చాటనుంది. వీటితో పాటుగా రష్మిక ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా అలరించనుంది.

  Last Updated: 14 Feb 2024, 08:00 AM IST