Rashmika Remuneration: రష్మిక తగ్గేదేలే.. ఒక్క సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా!

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఈ బ్యూటీ పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది.

  • Written By:
  • Updated On - March 31, 2023 / 11:58 AM IST

అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లోనూ బాగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్న. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఈ బ్యూటీ పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. రీసెంట్ గా రష్మిక ఓ తెలుగు సినిమాకు సైన్ చేసిన విషయం తెలిసిందే. నితిన్‌తో కలిసి ‘VNR త్రయం’ అనే మూవీతో సందడి చేయబోతోంది. అయితే ఈ చిత్రానికి రష్మిక తన రెమ్యూనరేషన్ (పారితోషికం) భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ అందుకుంటుండటంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లో ఒకరు. లేటెస్ట్ నితిన్ తో కలిసి నటించేబోయే సినిమాకు రూ. 3-5 కోట్ల మధ్య పారితోషికం అందుకోనున్నట్లు వెల్లడైంది. వీరిద్దరి కాంబినేషన్ లో ‘భీష్మ’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ బ్యూటీ రెండోసారి నితిన్ తో, ఇక దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి మళ్లీ వర్క్ చేయబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ VNR త్రయం నిర్మించగా, GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న ప్రస్తుతం రణబీర్ కపూర్‌తో కలిసి ‘యానిమల్’ సినిమా చేస్తోంది. టాలీవుడ్‌లో  నితిన్ సినిమాతో పాటు అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2 సినిమాలతో బిజీగా ఉంది.

Also Read: Rana Naidu: రానానాయుడిపై విమర్శల వెల్లువ.. తెలుగు వెర్షన్ ఔట్!