Rashmika Mandanna: యానిమల్ మూవీ ట్రోల్స్ పై స్పందించిన రష్మిక.. అలాంటి వాళ్లంటే అసహ్యం అంటూ!

  • Written By:
  • Publish Date - April 5, 2024 / 06:14 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అంతేకాకుండా ప్రస్తుతం లక్కీ హీరోయిన్గా కూడా రాణిస్తోంది. ఇది ఇలా ఉంటే రష్మిక ఇటీవలే యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది.

We’re now on WhatsApp. Click to Join
దీంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక, త్రిప్తి డిమ్రి కీలక పాత్రల్లో నటించారు. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక సన్నివేశం రష్మిక బాగా చేయలేదంటూ తీవ్రస్తాయిలో విమర్శలు వచ్చాయి. మూవీలోని కర్వాచౌత్ సన్నివేశంలో రష్మిక ఒక చోట డైలాగ్ సరిగ్గా చెప్పలేదని కొందరు విమర్శించారు.

Also Read: Balakrishna: బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK109కీ టైటిల్ ఫిక్స్?

తాజాగా బాలీవుడ్ నటి నేహా ధుపీయాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యానిమల్ ట్రోల్స్ పై స్పందించింది. మహిళలను వారి శరీరాకృతిపై ట్రోల్ చేసే వాళ్లంటే నాకు అసహ్యం. అలాంటి వారు కొందరు నా సినిమాలు, అందులో నా నటనపై ట్రోల్స్ చేస్తున్నారు. నేను ఎలా పనిచేస్తున్నానో నాకు తెలుసు. ఐదు నెలల క్రితమే ప్రదర్శన ఇచ్చాను. దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్న కర్వచౌత్ సన్నివేశం చేసిన తర్వాత సెట్ లో ఉన్నవాళ్లందరు చప్పట్లు కొట్టారు. ఆ సన్నివేశం సినిమాకే హైలెట్. ఆ సీన్ కోసం ఎంతో కష్టపడ్డాను. ఆ ఒక్క సీన్ లోనే ఎన్నో రకాల ఎమోషన్స్ పలికించాలి.

Also Read: Pushpa 2: యశ్ రికార్డ్ ని బన్నీ బద్దలు కొట్టనున్నాడా.. పై చేయి మాత్రం ఆ హీరోదే!

అలాంటి కష్టమైన సన్నివేశం పూర్తి చేసిన తర్వాత నా నటన చూసి సెట్ లో ఉన్నవారు అందరూ చప్పట్లు కొట్టారు. అలాగే రిలీజ్ అయిన తర్వాత కూడా థియేటర్లలో అంతే రెస్పాన్స్ వచ్చింది. కానీ అందరికీ నచ్చిన ఆ సీన్ పై కొందరు మాత్రమే విమర్శించారు. దాదాపు 9 నిమిషాల సీన్ అయితే 10 సెకండ్ల డైలాగ్ బాలేదని ట్రోల్ చేశారు. కానీ నేను వాటిని పట్టించుకోను. ఎందుకంటే నేను గిరిగీసుకోని ఒక దగ్గర ఉండాలని అనుకోవడం లేదు. ఎవరి ఇష్టం వాళ్లది. అందరికీ నచ్చాలని రూల్ ఏమి లేదు కదా అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది రష్మిక.

Follow us