తన స్వీట్ వాయిస్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సింగర్ సునీత (Singer Sunitha). అందానికి అందం.. గాత్రానికి గాత్రం రెండు తోడుకావడంతో సునీతకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. ఇక సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఎంతో మంది హీరోయిన్‌లకు గాత్రం దానం చేసింది. కెరియర్ పిక్ స్టేజ్ లో ఉన్న క్రమంలో పెళ్లి చేసుకోవడం..ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత భర్త తో మనస్పర్థలు రావడం తో విడిపోయారు. అప్పటి నుండి పిల్లల బాధ్యత చూసుకుంటూ వచ్చింది.
ఈ మధ్యనే బిజినెస్ మ్యాన్ అయినటువంటి రామ్ వీరపనేని (Ram Veerapaneni) రెండో పెళ్లి (2nd Wedding) చేసుకుంది. ఈ పెళ్లికి ముందు సింగర్ గా చాలా మంది అభిమానించేవారు. కానీ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వినిపించాయి. తర్వాత అంత సైలెంట్ అయ్యింది. తాజాగా మరోసారి ఆమె పేరు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సునీత కు తన భర్త కు మధ్య గొడవలు మొదలయ్యాయిని.. దీనికి కారణం కూడా ఒక యూట్యూబర్ (Youtuber ) అని ప్రచారం జరుగుతుంది. ఓ యూట్యూబర్ తో ఆమె దిగిన ఫోటోలు, వీడియోలే కారణం అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోల పై సీరియస్ అయిన ఆమె భర్త రామ్ ఇలా దిగావని సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ బాగా జరిగినట్టు తెలుస్తోంది. మరి ఈ గొడవలు నిజంగానే జరిగాయా లేదా సోషల్ మీడియా లో వస్తున్న రూమర్స్ అనేది తెలియలేదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది.
Read Also : Yuvraj Singh : మంచు లక్ష్మి బర్త్ డే పార్టీ లో యువరాజ్ సింగ్ సందడి