Rakul Preet Singh : అలాంటి రాత్రులు గడిపా.. ఏది అంత ఈజీగా రాదంటున్న రకుల్..!

Rakul Preet Singh తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుని అనతికాలం లోనే ఫాం కోల్పోయిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో దాదాపు అవకాశాలు లేని ఈ టైం లో బాలీవుడ్ లో మాత్రం అడపాదడపా

Published By: HashtagU Telugu Desk
Rakul Preet Singh Starts Resaurant in Hyderabad

Rakul Preet Singh Starts Resaurant in Hyderabad

Rakul Preet Singh తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుని అనతికాలం లోనే ఫాం కోల్పోయిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో దాదాపు అవకాశాలు లేని ఈ టైంలో బాలీవుడ్ లో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తుంది రకుల్. అయితే తన కెరీర్ విషయంలో అంత ఈజీగా అవకాశాలు రాలేదని అంటుంది అమ్మడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ చిన్నప్పటి నుంచి తను నటిని కావాలని కల కన్నానని అన్నది.

మోడల్ గా చేస్తూ అలా సినిమాల్లో ఛాన్స్ అందుకున్నా అని చెప్పిన రకుల్ అందరిలానే తాను ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నానని చాలా తిరస్కరణలను చూశానని అన్నది రకుల్.

సినిమా ప్రయత్నాల్లో భాగంగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నానని. ముంబైలో అడుగు పెట్టి ఒంటరిగా జీవిచానని అన్నది. సినిమాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి క్యూలైన్లో నిలబడి ఆడిషన్స్ ఇచ్చానని అన్నది. కొన్ని సినిమాలకు సైన్ చేసి ఓకే అనుకునే లోగా రాత్రికి రాత్రే తన ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకునే వారు. అలా ఎందుకు జరిగాయో అర్ధమయ్యేది కాదు. దీని వల్ల తను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అంటుంది రకుల్ (Rakul).

ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నానని చెప్పిన రకుల్ తన జీవితం లో ఈ స్థాయికి రావడానికి కారణం తన ఫ్యామిలీ సపోర్ట్ వల్లే అని చెప్పింది. రకుల్ తెలుగులో కొండపొలం (Kondapolam) చివరగా చేసింది. ఆమెకు తెలుగులో కన్నా హిందీ లోనే అవకాశాలు వస్తున్నాయి.

Also Read : NTR To Meet Amit Shah Again : మరోసారి జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ.. నిజమేనా..?

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 03 Nov 2023, 04:08 PM IST