Rajinikanth: రోజూ మద్యం తాగే రజినీకాంత్.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి!

సినీ ఇండస్ట్రీలో కేవలం స్టైల్ ద్వారానే స్టార్ హీరోగా ఎదిగిన ఒకే ఒక్క హీరో ఎవరన్నా ఉన్నారంటే అది రజినీకాంత్.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 01 27 At 21.16.23

Whatsapp Image 2023 01 27 At 21.16.23

Rajinikanth: సినీ ఇండస్ట్రీలో కేవలం స్టైల్ ద్వారానే స్టార్ హీరోగా ఎదిగిన ఒకే ఒక్క హీరో ఎవరన్నా ఉన్నారంటే అది రజినీకాంత్. కండెక్టర్ స్థాయి నుండి కష్టపడి సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగిన రజినీకాంత్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఆయన జీవితం ఎంతో మంది స్పూర్తిదాయకం కాగా.. రజినీ జీవితంలోని చీకటి కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

రజినీకాంత్ అంటే సినిమాలు, కుటుంబం, ధ్యానం అని మనకు బాగా తెలుసు. కానీ రజినీకాంత్ జీవితం మనం అనుకున్నట్లు కాకుండా వేరేలా ఉందనే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాను రోజూ మద్యం తాగే వాడినని, లెక్కలేనన్ని సిగరెట్లు తాగే వాడినని రజినీకాంత్ తాజాగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసలు రజినీకాంత్ ఏంటి.. మందు తాగడం, సిగరెట్లు తాగడం ఏంటనే చర్చ సాగుతోంది.

తాజాగా రజినీకాంత్ ఓ కార్యక్రమానికి హాజరై.. తన భార్య లత గురించి, తన జీవితం గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. రజినీ మాట్లాడుతూ.. ‘నా భార్య లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్ కు నేను రుణపడి ఉంటాను. బస్ కండెక్టర్ గా నేను పని చేస్తున్నప్పుడు రోజూ మద్యం తాగే వాడిని. రోజుకు ఎన్ని సిగరెటట్ు తాగేవాడినో లెక్క ఉండేది కాదు. అలాగే రోజూ మాంసాహారం తీసుకునే వాడిని. కానీ ఈ మూడు మంచి అలవాట్లు కాదు. వీటికి బానిసలైన వాళ్లు కొంతకాలం తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరన్నది నా అభిప్రాయం. నా భార్య లత తన ప్రేమతో నన్ను ఎంతో మార్చింది. ఆమె వల్లే ఇప్పుడు నేను క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను’ అని అన్నాడు.

ఈ మాటలు విన్న జనాలు మాత్రం.. రజినీకాంత్ ఒకప్పుడు అలా ఉన్నాడా? అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా, ఆడంబరాలకు దూరంగా ఉన్న రజినీకాంత్ ఒకప్పుడు ఆ స్థాయిని దాటి వచ్చాడా అని చర్చించుకుంటున్నారు. కాగా రజినీకాంత్ ప్రస్తుతం నీల్సన్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా చేస్తుండటం తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్ లు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

  Last Updated: 27 Jan 2023, 09:16 PM IST