Site icon HashtagU Telugu

NTR – Rajamouli : మరోసారి రాజమౌళి – ఎన్టీఆర్ కాంబో ?

Rajamouli Ntr Combo

Rajamouli Ntr Combo

ఎన్టీఆర్ – రాజమౌళి (NTR – Rajamouli) కాంబో అంటే నందమూరి అభిమానులకే కాదు యావత్ సినీ ప్రేక్షకులకు ఆసక్తి. ఈ ఇద్దరూ కలిస్తే ప్రతి సారి ప్రేక్షకులకు ఓ పండుగే. ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసు గెలిచిన వీరిద్దరూ మళ్లీ ఓ భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి ఇది రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాకుండా, సరికొత్త జానర్ లో బయోపిక్ గా రూపొందనుందన్న టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

Operation Sindoor: తిరంగా ర్యాలీకి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కు పురందేశ్వరి పిలుపు!

ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఎన్టీఆర్ – రాజమౌళి కాంబోలో వచ్చే ఈ సినిమా భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కావొచ్చని సమాచారం. ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ వహించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు రాజమౌళి సూపర్వైజన్ మరియు నిర్మాణ భాగస్వామిగా ఉండే అవకాశముంది. తారక్ ఇందులో దాదాసాహెబ్ పాత్రలో నటించనున్నారని సమాచారం, ఇది నిజమైతే ఇది తారక్ కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలవనుంది. మరి ఈ వార్త లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Frank Video : ఏంటి ఈ పిచ్చి వేషాలు అంటూ సజ్జనార్ సీరియస్

ప్రస్తుతం రాజమౌళి ..మహేష్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఒడిశా, యూరప్, హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమా 2026 అక్టోబర్ గానీ, 21027 సంక్రాంతికి గానీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమౌళి రూపొందించే సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, జాన్ అబ్రహం విలన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.