ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి (Rajamouli) తన కెరీర్ ప్రారంభంలో పొందిన తొలి జీతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘కుబేర’ ప్రీ రిలీజ్ (Kuberaa Pre Release) ఈవెంట్‌లో మాట్లాడిన జక్కన్న, తాను మొదటగా అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశానని, అప్పట్లో తనకు నెలజీతంగా రూ.50 లభించిందని చెప్పారు. అయితే ఆ జీతాన్ని ఎక్కడ ఖర్చు చేశానన్న విషయం మాత్రం ఇప్పుడు తనకు గుర్తు లేదని చెప్పి ప్రేక్షకుల్లో నవ్వు తెప్పించారు.
Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాకముందే బిఆర్ఎస్ – కాంగ్రెస్ ఫైట్ ..?
ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ములపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. శేఖర్ కమ్ముల తన నమ్మకాలను సినిమాల రూపంలో ప్రేక్షకులముందు ఉంచే గొప్ప దర్శకుడని అన్నారు. తనలో అలాంటి సిద్ధాంతాలు లేవని, తాను ప్రేక్షకులను అలరించడానికి, ఎంటర్‌టైన్ చేయడానికి మాత్రమే సినిమాలు తీస్తానని రాజమౌళి స్పష్టం చేశారు. తాను శేఖర్‌ను గౌరవంతో చూస్తానని, ఆయనలోని తీరుని ఎంతో మెచ్చుకుంటానని అన్నారు.
Dhanush : ధనుష్ కోరికను పవన్ కళ్యాణ్ తీరుస్తాడా..?
ఇక రాజమౌళి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా గర్వపడే స్థాయి దర్శకుడిగా ఎదిగారు. ‘బాహుబలి’ సిరీస్‌తో పాటు ‘RRR’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. హాలీవుడ్ లోను ఈ రెండు సినిమాలు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న రాజమౌళి, ఆ సినిమాతో మరోసారి దేశవిదేశాల్లో తెలుగు సినిమాకు ప్రతిష్ట తీసుకురానున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.