Pushpa 2 : పుష్ప 2 ఇండియా, రష్యాలో ఒకేసారి రిలీజ్

  • Written By:
  • Publish Date - December 4, 2022 / 08:27 AM IST

మల్టీ లాంగ్వేజ్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 రిలీజ్‌కి టీం రెడీ అయింది.తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయిన పుష్ప మొదటి భాగం భారీగా రికార్డులను కొల్లగొట్టింది. దీంతో త్వరగా రెండో పార్ట్ ని రిలీజ్ చేయడానికి టీం సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే, ఈ రెండో పార్ట్ ఇండియాతో పాటు రష్యాలో కూడా ఒకే రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం..

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. రష్యాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత రవిశంకర్ చెబుతున్నారు.

భన్వర్ సింగ్ షెకావత్ అనే ఫారెస్ట్ ఆఫీసర్‌తో అల్లు అర్జున్ ఫైనల్ ఫైట్ ఈ పార్ట్‌లో ఉండబోతోందట. మరోవైపు పార్ట్ 2లో ఇంకో ఐటం సాంగ్‌తో యువతను ఉర్రూతలూగించబోటున్నాడు సుకుమార్ .ఈ సారి సమంతకు బదులు మరో బ్యూటీని బన్నీతో స్టెప్పేయించాలని స్కెచ్చేసిన సుకుమార్.. ఇందుకోసం జాన్వీ కపూర్ పేరును పరిశీలనలోకి తీసుకున్నరట. ఎలాగూ జాన్వీ దృష్టి టాలీవుడ్ పై ఉంది కాబట్టి హుషారెత్తించే పాటతో ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని సుకుమార్ భావిస్తున్నారట.