Site icon HashtagU Telugu

Pushpa 2 The Rule : ‘‘పుష్ప 2 ది రూల్’’.. రూ.700 కోట్ల క్లబ్‌లోకి హిందీ వర్షన్.. ఈ లిస్టులోని ఇతర చిత్రాలివీ

Pushpa 2 The Rule Hindi Film Dubbed Version Allu Arjun

Pushpa 2 The Rule : అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్ దుమ్ము రేపుతోంది. ఈ సినిమా బాక్సాఫీసులో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటిదాకా హిందీ వర్షన్ దాదాపు రూ.700 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ తదితరులు నటించారు. ఈసందర్భంగా కలెక్షన్లపరంగా రూ.100 కోట్లు, ఆపైన వసూళ్లను సాధించిన హిందీ సినిమాల గురించి తెలుసుకుందాం..

Also Read :WhatsApp New Feature : ఇక వాట్సాప్‌లోనే డాక్యుమెంట్‌ స్కానింగ్‌ ఫీచర్

గజిని – రూ.100 కోట్లు

ఏఆర్ మురుగదాస్ తీసిన గజిని(Pushpa 2 The Rule) మూవీ 2008లో విడుదలైంది. ప్రతీకారం తీర్చుకునే కోణంలో ఈ మొత్తం మూవీ సాగుతుంది. ఇందులో అమీర్ ఖాన్, అసిన్ ప్రధాన పాత్రలు పోషించారు.  గజిని మూవీ భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా రికార్డును సాధించింది. మురుగదాస్ 2005 సంవత్సరంలో ఒక తమిళ హిట్‌ మూవీ తీశారు. దాన్ని గజిని పేరుతో  హిందీలో రీమేక్ చేశారు.  గజినీ కంటే ముందు.. 2007లో షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమా రూ.90 కోట్లను కలెక్ట్ చేసింది. 2008 సంవత్సరంలో విడుదలైన అక్షయ్ కుమార్ మూవీ సింగ్ ఈజ్ కింగ్ కూడా రూ.90 కోట్ల రేంజులోనే కలెక్షన్లను రాబట్టింది.  

3 ఇడియట్స్ – రూ. 200 కోట్లు

అమీర్‌ఖాన్ నటించిన 3 ఇడియట్స్ హిందీ సినిమా 2010లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో రూ.200 కోట్ల కలెక్షన్లను సాధించింది. రూ. 200 కోట్లు సంపాదించిన తొలి  హిందీ చిత్రంగా ఇది రికార్డును క్రియేట్ చేసింది.  ఈ సినిమాను విధు వినోద్ చోప్రా నిర్మించగా, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు.

పీకే –  రూ. 300 కోట్లు

పీకే అనేది సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇందులో అమీర్ ఖాన్ నటించారు. ఈ సినిమా 2014లో విడుదలైంది. ఈ హిందీ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ మూవీలో అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజయ్ దత్, సౌరభ్ శుక్లా వంటి వారు నటించారు.

Also Read :Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే

బాహుబలి 2: ది కన్‌క్లూజన్ – రూ. 500 కోట్లు

‘బాహుబలి 2 : ది కన్‌క్లూజన్’ మూవీ 2017లో విడుదలైంది. ఈ సినిమా హిందీ వర్షన్ మన దేశంలో దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా వసూళ్లు చేసింది. ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ నటించారు.

స్త్రీ 2 – రూ. 600 కోట్లు

స్త్రీ2 మూవీ ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయింది. ఈ సినిమా రూ.600 కోట్ల కలెక్షన్లను సాధించింది.  ఇంత భారీ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ సినిమా ఇదే. ఇందులో రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ నటించారు.