Pragya Jaiswal Latest Photoshoot టాలీవుడ్ పై ఎన్ని ఆశలు పెట్టుకున్నా కొందరు హీరోయిన్స్ కి టైం కలిసి రాక అవకాశాలు ఉండవు. అలా అన్ లక్కీ హీరోయిన్స్ పేర్లలో ముందు పేరుగా ఉంటుంది ప్రగ్యా జైశ్వాల్. మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు వరుణ్ తేజ్ తో కంచె సినిమాలో నటించి ఆడియన్స్ దృష్టిలో మార్కులు కొట్టేసింది.
ఆ సినిమా ఇచ్చిన లిఫ్ట్ తో స్టార్ రేంజ్ కి వెళ్తుందని అనుకోగా యువ హీరోల సినిమాలతోనే కెరీర్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్స్ తో నటించినా కూడా ప్రగ్యా జైశ్వాల్ కు లక్ కలిసి రాలేదని చెప్పొచ్చు.
రెండేళ్ల క్రితం వచ్చిన అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రగ్యా జైశ్వాల్ ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు. అసలు అమ్మడిని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిగా కంచె బ్యూటీ తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. ఫాలోవర్స్ కు గ్లామర్ ట్రీట్ అందించేందుకు రోజు రోజుకి డోస్ పెంచేస్తుంది ప్రగ్యా జైశ్వాల్.
లేటెస్ట్ గా అమ్మడు పైన షర్ట్ వేసుకుని కింద మాత్రం వదిలేసింది. థై షో తో ఫాలోవర్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అమ్మడు. ఈ ఫోటో షూట్స్ చూసైనా ప్రగ్యా కి ఛాన్స్ ఇవ్వాల్సిందే అనేలా ఉంది. కానీ అమ్మడు ఎంత ప్రయత్నిస్తున్నా అవకాశాలు మాత్రం రావట్లేదు. ప్రగ్యా జైశ్వాల్ ఫోటో షూట్స్ ఆమెకు సోషల్ మీడియాలో మైలేజ్ అయితే పెంచుతున్నాయి కానీ ఆమెకు అవకాశాలు తీసుకు రావడంలో మాత్రం ఉపయోగపడట్లేదు.
Also Read : Kiara Advani : యష్ టాక్సిక్ లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. అమ్మడి ఖాతాలో మరో లక్కీ ప్రాజెక్ట్..!