Prabhas Raja Saab : రాజా సాబ్ ఇక సంక్రాంతికే ఫిక్స్ అవ్వొచ్చా..?

ప్రభాస్ రాజా సాబ్ సినిమాను మారుతి (Director Maruthi) డైరెక్ట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అదిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్

  • Written By:
  • Publish Date - July 22, 2024 / 05:45 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా కల్కి (Prabhas Kalki) హిట్ తో సూపర్ జోష్ లో ఉన్నాడు. కల్కి సినిమా తో ప్రభాస్ అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే లెక్క. ప్రభాస్ రాజా సాబ్ సినిమాను మారుతి (Director Maruthi) డైరెక్ట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అదిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ నటిస్తునంది. కల్కి సక్సెస్ మజాని ఎంజాయ్ చేస్తున్న రెబల్ ఫ్యాన్స్ ఇప్పుడు మళ్లీ రాజా సాబ్ తో కూడా మరో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

రాజా సాబ్ సినిమాను ముందు డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నా ఇప్పుడు డిసెంబర్ రేసులో పుష్ప 2 (Pushpa 2), గేం చేంజర్ (Game Changer) లు వచ్చాయి కాబట్టి ఇక రాజా సాబ్ సంక్రాంతికే ఫిక్స్ అవ్వొచ్చని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వస్తే మిగతా సినిమాలకు ఎఫెక్ట్ పడుతుంది.

అందుకే కనీసం 2, 3 రోజులు గ్యాప్ ఉండేలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే విశ్వంభర సినిమా జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు. ఆ సినిమా తర్వాత రాజా సాబ్ కూడా సంక్రాంతికి వస్తుంది. ఇక మరోపక్క రవితేజ (Raviteja) సినిమా కూడా ఒకటి సంక్రాంతికే టార్గెట్ అని తెలుస్తుంది. సో ఈ లెక్కన రాజా సాబ్ తో ఫైట్ చేసేందుకు మిగతా సినిమాలు రెడీ అవుతున్నాయని చెప్పొచ్చు.

రాజా సాబ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తుంది. సినిమాలో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడని అంటున్నారు. మారుతి ఈ సినిమాలో ప్రభాస్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించబోతున్నాడని అర్ధమవుతుంది. రాజా సాబ్ ని ప్రస్తుతం పూర్తి చేయాలని చూస్తున్న ప్రభాస్ ఆ తర్వాత కల్కి 2, స్పిరిట్ సినిమాల కోసం డేట్స్ ఇస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలతో కూడా రెబల్ స్టార్ తన స్టామినా మరోసారి ప్రూవ్ చేయబోతున్నాడు.

Also Read : Nani : నానితో 100 కోట్ల సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?

Follow us