Site icon HashtagU Telugu

The Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్ వెలితిని మారుతీ పూడ్చడా..?

Prabhas New Look

Prabhas New Look

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab)టీజర్ విడుదలై భారీ హైప్‌ను సృష్టించింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కెరీర్‌ లో పాన్ ఇండియా మార్పు వచ్చినా, అతని వింటేజ్ శైలి మిస్ అవుతున్నామన్న భావన అభిమానుల్లో ఉండేది. అయితే ‘రాజాసాబ్’ టీజర్‌ (The Raja Saab Teaser) ద్వారా ఆ లోటు తీరినట్టు స్పష్టమవుతోంది. ఇందులో ఆయన చెప్పిన డైలాగ్స్, యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలు, ఎక్స్‌ప్రెషన్లు , లుక్ అన్నీ కలిసి వింటేజ్ ప్రభాస్‌ను గుర్తు చేస్తున్నాయని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Narendra Modi : సైప్రస్‌లో ప్రధాని మోదీకి అనూహ్య స్వాగతం.. మోదీ పాదాలకు నమస్కరించి

ఈ సినిమా ఓ డార్క్ ఫ్యాంటసీ హారర్-కామెడీగా రూపొందుతోందని టీజర్‌ స్పష్టం చేసింది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ చీకటి వాతావరణం, రహస్యత, ఫ్యాంటసీ వర్డ్‌ల బలమైన ఫీలింగ్‌ కనిపిస్తోంది. టీజర్‌లో వచ్చే విజువల్స్ చూస్తే, ప్రేక్షకుడు కథలోకి పూర్తిగా లీనమయ్యేలా కథను నిర్మించినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ స్టైల్‌కు తగినట్టే కామెడీ, యాక్షన్, మిస్టరీ మేళవింపుగా కథ సాగనుందని సూచనలు ఉన్నాయి.

Liquor Scam : లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిదే కీలకపాత్ర – సీఐడీ

ఇక టీజర్‌లోని కొన్ని కీలక సీన్లు సినిమాపై మరింత ఆసక్తి రేపాయి. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై స్కూల్ బస్సు నుంచి వేలాడుతున్న ప్రభాస్ సీన్‌ను చూపించి, విభిన్న దృశ్యాన్ని అందించారు. అలాగే గుర్రంపై ట్రైల్ వెనుక బందిపోటు లుక్‌లో ప్రభాస్ కనిపించే సన్నివేశం సినిమాకి ఆసక్తికర మలుపు ఇస్తోంది. రాజాసాబ్ అనే పాత్ర వాస్తవానికి ఓ దొంగ కధతో ముడిపడి ఉందా? అతను విలువైన వస్తువులను దోచి తన అంతఃపురంలో దాచేవాడా? అనే అనుమానాలు టీజర్ ద్వారా వేయబడినవి. మొత్తంగా ‘రాజాసాబ్’ టీజర్ ప్రభాస్ అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌గా నిలిచింది.