Pooja Hegde : అలా చేస్తానంటున్న కూడా పూజ హెగ్డేకు ఆఫర్లు రావట్లేదా..?

బుట్ట బొమ్మ పూజ హెగ్డే (Pooja Hegde) నిన్నటి వరకు టాలీవుడ్ లో సూపర్ ఫాం కొనసాగించింది. సడన్ గా ఏమైందో ఏమో కానీ అమ్మకి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. గుంటూరు కారం సినిమా నుండి బయటకు వెళ్లిన

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde Bad Luck Continues

Pooja Hegde Bad Luck Continues

బుట్ట బొమ్మ పూజ హెగ్డే (Pooja Hegde) నిన్నటి వరకు టాలీవుడ్ లో సూపర్ ఫాం కొనసాగించింది. సడన్ గా ఏమైందో ఏమో కానీ అమ్మకి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. గుంటూరు కారం సినిమా నుండి బయటకు వెళ్లిన పూజా హెగ్డే మరో సినిమాకు సైన్ చేయలేదు. అమ్మడు తెలుగులో సినిమాలు చేయకపోవటానికి కారణాలు ఏవైనా సరే టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం బుట్ట బొమ్మని చాలా మిస్ అవుతున్నారు. మహేష్ గుంటూరు కారం నుండి ఎగ్జిట్ అయిన తర్వాత పూజా హెగ్డే కి అసలు ఆఫర్ రాలేదా లేదా వచ్చిన ఆమె కాదన్నదా అన్న విషయం బయటకు రావాల్సి ఉంది.

మరి లేట్ అయితే ఇంకా అవకాశాలు రావనుకుందో ఏమో కానీ.. పూజా హెగ్డే తెలుగు అవకాశాల కోసం తన ప్లాన్ మార్చేసినట్టు తెలుస్తుంది. నిన్న మొన్నటిదాకా స్టార్ క్రేజ్ తో ఒక రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన అమ్మడు. ఇప్పుడు జస్ట్ అవకాశం ఇస్తే చాలు అనుకుంటుందట. అంతేకాదు నిన్న మొన్నటి దాకా దాదాపు రెండు కోట్ల దాకా పారితోషికం అందుకున్న పూజ హెగ్డే ఇప్పుడు సగం ఇస్తే చాలని అంటుందట.

టాలీవుడ్ లో తన మార్కెట్ పడిపోయింది అనుకుంటున్న పూజా హెగ్డే మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో తెలుగులో చాన్స్ వస్తే చాలు రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు అమ్మడు. మరి తగ్గించిన ఈ రెమ్యూనరేషన్ వల్ల అయినా తెలుగులో పూజా హెగ్డే కి అవకాశాలు వస్తాయో రావో చూడాలి. పూజా హెగ్డే ఉంటే సినిమాలో గ్లామర్ కి డోకా లేదు అన్నట్టు. ఈసారి ఛాన్స్ రావాలి కానీ నెక్స్ట్ లెవెల్ లో గ్లామర్ షో చేయాలనుకుంటుంది బుట్ట బొమ్మ.

Also Read : Dhanush Rayan First Look : ధనుష్ రాయన్ లుక్ చూశారా..?

  Last Updated: 19 Feb 2024, 09:12 PM IST