Pooja Hegde : పూజా హెగ్దే ఏం తప్పు చేసింది.. ఆమెను అనుకుని ఆ ప్లేస్ లో కొత్త హీరోయిన్ ని ఎందుకు తీసుకున్నారు..?

టాలీవుడ్ లో పూజా హెగ్దే (Pooja Hegde) కెరీర్ దాదాపు ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. మహేష్ గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అయిన అమ్మడు ఆ తర్వాత తెలుగులో ఒక్కటంటే ఒక్క ఛాన్స్

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde Huge Demand for Naga Chaitanya movie

Pooja Hegde Huge Demand for Naga Chaitanya movie

టాలీవుడ్ లో పూజా హెగ్దే (Pooja Hegde) కెరీర్ దాదాపు ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. మహేష్ గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అయిన అమ్మడు ఆ తర్వాత తెలుగులో ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాబట్టుకోలేదు. పూజాని కావాలనే వద్దనుకుంటున్నారా లేదా ఆమె చేయట్లేదా అన్నది తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp : Click to Join

అయితే పూజా హెగ్దే గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ వైరల్ గా మారింది. తెలుగులో ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి పూజా హెగ్దేని ఫైనల్ చేశారట. కానీ చివరికి ఆమెను కాదని ఒక కొత్త హీరోయిన్ ను తీసుకున్నారని తెలుస్తుంది.

మాస్ మహారాజ్ రవితేజ అనుదీప్ కెవి కాంబినేషన్ లో మొదట పూజా హెగ్దేనే హీరోయిన్ గా అనుకున్నారట. ఆమెతో కథా చర్చలు కూడా జరిగాయని టాక్. ఎలాగు స్టార్ సినిమాలు రావట్లేదు కదా అని టైర్ 2 హీరోలతో అయినా అడ్జెస్ట్ అవుదామని పూజా అనుకుంది. కానీ ఫైనల్ గా ఆ సినిమాలో ఇప్పుడు సప్త సాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ ని ఫిక్స్ చేశారట. ఈ ఆఫర్ తో రుక్మిణికి తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది.

పూజా హెగ్దే మాత్రం ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ అయ్యిందని నిరుత్సాహ పడుతుంది. పూజా హెగ్దే ఏం తప్పు చేసిందని ఇలా చేస్తున్నారు. ఇలా పగ బట్టి మరీ ఆమెకు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. పూజా హెగ్దే ఉంటే సినిమాలో గ్లామర్ ట్రీట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఏదో వరుస ఫ్లాపులు పడుతున్నాయి కదా అని ఆమెను దూరం పెట్టడం ఏమి బాగాలేదని ఆమె ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. పూజా హెగ్దే మాత్రం తెలుగులో ఒక ఛాన్స్ వస్తే చాలని అనుకుంటుంది.

Also Read : Mrunal Thakur Glamour Attack : ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ లో మృణాల్ గ్లామర్ ఎటాక్.. బాలీవుడ్ అంటేనే రెచ్చిపోతున్న అమ్మడు..!

  Last Updated: 30 Jan 2024, 08:07 AM IST