Pooja Hegde : పొట్లం కట్టిన బిర్యానికి బొట్టు బిల్ల పెట్టినట్టు..!

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సినిమాల వేగం తగ్గించినా సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. తన ప్రతి ఫోటో షూట్ తెలుగు ఆడియన్స్ కి ఆమె ఇచ్చే కానుకలా రచ్చ రంబోలా

Published By: HashtagU Telugu Desk
Special Song Missed to Pooja Hegde

Special Song Missed to Pooja Hegde

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సినిమాల వేగం తగ్గించినా సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. తన ప్రతి ఫోటో షూట్ తెలుగు ఆడియన్స్ కి ఆమె ఇచ్చే కానుకలా రచ్చ రంబోలా చేస్తున్నాయి. ఈమధ్యనే అమ్మడు శారీ లుక్ లో పెళ్లికూతురిగా మారి అందరిని అలరించగా లేటెస్ట్ గా మరోసారి శారీ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. ఈసారి బ్లాక్ శారీలో అమ్మడు అదిరిపోయే ఫోజులను ఇచ్చింది. అలా చూస్తూ తన మాయలో పడేసేలా ఉన్న బుట్ట బొమ్మ తను షేర్ చేసిన ఫోటోలకు ఒక క్యాప్షన్ కూడా పెట్టింది.

అల వైకుంఠపురములో రాములో రాములా సాంగ్ లో పొట్లం కట్టిన బిర్యానికి బొట్టు బిల్ల పెట్టినట్టు అని కామెంట్ పెట్టింది. బ్లాక్ శారీ అమ్మడు బిర్యానికి బొట్టు పెట్టినట్టుగా తన లుక్స్ గురించి తానే చెప్పేసుకుంది పూజా హెగ్దే. ఏది ఏమైనా అమ్మడిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించేలా అమ్మడి అందాలు ఉన్నాయి.

గుంటూరు కారం మిస్ అయిన తర్వాత తెలుగులో మరో ఛాన్స్ అందుకోని పూజా ఈసారి అవకాశం అంటూ వస్తే తన సత్తా చాటుతానని అంటుంది. అంతేకాదు గ్లామర్ విషయంలో ఇంకాస్త డోస్ పెంచేందుకు సిద్ధమైంది అమ్మడు. రెమ్యునరేషన్ విషయంలో కూడా పెద్దగా పట్టింపులు లేవని కూడా అంటున్నట్టు తెలుస్తుంది. అయినా కూడా పూజా బేబీకి ఛాన్సులు రావట్లేదు.

  Last Updated: 04 Mar 2024, 09:47 PM IST