Pawan : సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..? పవన్ సమాధానం ఇదే !

Pawan : ఇప్పటికే హరిహర వీరమల్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్త ఏడాది కావడంతో పవన్ పాలనపై పూర్తిగా ఫోకస్ పెట్టారు

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Key Statement On Hindi Language

Pawan Kalyan Key Statement On Hindi Language

జనసేన (Janasena) పార్టీ వ్యవహారాలు , రాష్ట్ర ప్రజల బాగోగుల్లో పూర్తిగా మునిగిపోయిన పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) సినిమాలకు గుడ్‌బై (Goodbye ) చెప్పేస్తారా? లేదా? అనే ప్రశ్న అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగా అత్యంత బిజీగా ఉన్న ఆయన కొత్త సినిమాలకు కమిట్ అవుతారా అనే సందేహం అందరిలో ఉంది. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజి చిత్రాలు కొంత మేరకు పెండింగ్‌లో ఉండగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొనసాగుతుందా? లేదా? అనే అనుమానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. డబ్బు అవసరమైనంత కాలం సినిమాలు ఆపబోనని, కానీ పాలన విషయంలో ఎలాంటి రాజీ పడకుండా రెండు పనులను సమానంగా చేసుకుంటానని స్పష్టం చేశారు.

Betting App Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు శ్యామల

జనసేన కార్యకలాపాలకు, పార్టీ విరాళాలకు, సహాయ కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు ఆర్థిక మద్దతు అవసరం అవుతుందని అన్నారు. అయితే, ఇప్పుడు ఆయన ఉన్న రాజకీయ పదవి వల్ల పెద్ద సినిమాలను చేయడం సాధ్యమా? అనే ప్రశ్న కూడా ఉంది. ఇప్పటికే హరిహర వీరమల్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్త ఏడాది కావడంతో పవన్ పాలనపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. అయితే క్రమంగా సిస్టం సెట్ అయ్యాక సినిమాలను కూడా బాగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లే అవకాశముంది. తక్కువ రోజుల్లో పూర్తి చేయగల సినిమాలను ఎంచుకుంటే రాజకీయ బాధ్యతలు – సినీ ప్రాజెక్టులు రెండు బ్యాలెన్స్ చేయడం సులభం అవుతుంది.

Betting App Case : విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయాలనీ KA పాల్ డిమాండ్

పవన్ పూర్తిగా సినిమాలకు గుడ్‌బై అనేది జరగని పని. కానీ భారీ బడ్జెట్ చిత్రాలకు పెద్దగా సమయం కేటాయించలేరు. త్రివిక్రమ్ లాంటి అనుభవజ్ఞుల సలహాలు కూడా ఉండటంతో పవన్ ఈ రెండింటినీ సమతుల్యం చేసుకునేలా పక్కా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది.

  Last Updated: 24 Mar 2025, 01:44 PM IST