Site icon HashtagU Telugu

Niharika- Chaitanya: విడాకులు తీసుకున్న మెగా డాటర్ నిహారిక- చైతన్య.. పరస్పర అంగీకారంతో డివోర్స్

Niharika- Chaitanya

Resizeimagesize (1280 X 720) (1)

Niharika- Chaitanya: నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, చైతన్య (Niharika- Chaitanya) జొన్నలగడ్డ తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. కాగా 2020 డిసెంబర్‌లో నిహారిక వివాహం గుంటూరు ఐజి జె.ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరిగింది. వివాహం అనంతరం సినిమాలకు కొంత కాలంగా దూరంగా ఉన్న నిహారిక ఇటీవల ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.

సోషల్‌ మీడియా అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారిక- చైతన్య జొన్నలగడ్డ ఇద్దరు కూడా ఒకనొకరు అన్‌ ఫాలో చేసుకోవడంతో డివోర్స్ అనుమానాలు తెర పైకి వచ్చాయి. నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తన పెళ్లి ఫోటోలను డిలీట్‌ చేయడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.

Also Read: Samantha Love Quotes : లవ్ కోట్ పోస్ట్ చేసిన సమంత.. క్షణాల్లో వైరల్

నిహారిక, చైతన్య దంపతులకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఏప్రిల్ లో వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. తాజాగా వీరిద్దరికీ సుప్రీం ఆదేశాల ప్రకారం విడాకులు మంజూరు చేసింది. 2020లో చైతన్యతో నిహారిక వివాహమవగా.. మనస్పర్థల కారణంగా పెళ్లైన కొద్దికాలం నుంచే ఈ జంట దూరంగా ఉంటున్నారు. గతకొద్ది కాలంగా భర్త చైతన్యతో దూరంగా ఉంటున్న నిహారిక.. హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం కూకట్‌పల్లి కోర్టులో విడాకులకు అప్లై చేసుకుంది. నిహారిక, చైతన్యకు 2020లో వివాహం కాగా.. కొద్దీ రోజులకే మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.