Krishnaveni : ఎన్టీఆర్, ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి.లీలా.. చాలా ఫేమస్. వారందరూ కలకాలం తెలుగు సినీ ప్రియుల మనసుల్లో జీవించే ఉంటారు. ఈ మహామహులను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘన నిర్మాత (ప్రొడ్యూసర్), అలనాటి నటి కృష్ణవేణి ఇక లేరు. ఆమె 102 ఏళ్ల వయసులో వయోభారంతో ఇవాళ (ఆదివారం) ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయమే తమ మాతృమూర్తి కన్నుమూశారని ఆమె కుమార్తె అనురాధ వెల్లడించారు. ‘మనదేశం’ మూవీలో ఓ చిన్న పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి.లీలా ఈ సినిమాలో పాటలు పాడారు. ‘మనదేశం’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే, ఎన్టీఆర్‌కు జంటగా కృష్ణవేణి నటించారు. ఈ సినిమా 1949 నవంబరు 24న విడుదలైంది.
Also Read :Fake Interviews: ఫేక్ ఇంటర్వ్యూలు.. ఫేక్ జాబ్స్.. వందలాది యువతకు కుచ్చుటోపీ
కృష్ణవేణి నేపథ్యం..
- అలనాటి సినీ నిర్మాత కృష్ణవేణి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెంలో 1924 డిసెంబర్ 24న జన్మించారు.
- ఆమె తండ్రి డాక్టర్.
- కృష్ణవేణి(Krishnaveni) తొలినాళ్లలో డ్రామా ఆర్టిస్ట్‌గా పనిచేసేవారు.
- 1936లో ‘సతీ అనసూయ’ మూవీలో ఆమె బాలనటిగా పాత్రను పోషించారు.
- కృష్ణవేణికి సినిమా అవకాశాలు దొరకాలనే ఉద్దేశంతో వారి కుటుంబం అప్పట్లో చెన్నైకి వెళ్లి స్థిరపడింది.
- కృష్ణవేణి హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించింది.
- 1940లో మీర్జాపురం జమీందార్ మేకా రంగయ్యతో ఆమె పెళ్లి విజయవాడలో జరిగింది.
- కృష్ణవేణి భర్తకు శోభనాచల స్టూడియోస్ ఉండేది. దాని ద్వారానే ఆమె పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
- మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) ఆమె హీరోయిన్‌గా చేశారు.
- ‘దక్షయజ్ఞం’, ‘జీవన జ్యోతి’, ‘భీష్మ’, ‘గొల్లభామ’, ‘ఆహుతి’ వంటి సినిమాల్లో కృష్ణవేణి నటించారు.
- కృష్ణవేణి రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు.