Site icon HashtagU Telugu

NTR : ఎన్టీఆర్ కూడా ఆర్మీని తయారు చేసుకుంటున్నాడా..? సోషల్ మీడియాలో పెరిగిన ఫ్యాన్ వార్స్..

NTR Video

NTR Video

NTR : ఇటీవల కొంతమంది హీరోలు తాము గొప్పగా కనపడాలని, గొప్పగా ఎదగాలని మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పుడూ తమ పేరే ఉండాలని ట్రై చేస్తున్నారు. అందుకు ఫ్యాన్స్ ని ఆయుధంగా వాడుకుంటున్నారు కొంతమంది. దీంతో ఆ ఫ్యాన్స్ తమ హీరోల సినిమా ఫ్లాప్ అన్నా, సినిమా బాలేదు అన్నా, ఆ సినిమా హీరోని ఎవరైనా తిట్టినా వాళ్ళ మీద సోషల్ మీడియాలో బూతులతో దాడి చేస్తున్నారు.

ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడానికి అన్నట్టు నాకు మీరే బలం, మీరు లేకపోతే నేను లేను అని, మీరు ఫ్యాన్స్ కాదు నా ఆర్మీ అని ఫ్యాన్స్ గురించి ఎమోషనల్ గా గొప్పగా స్టేజి మీద ఓ నాలుగు మాటలు ఇంకా ఎక్కువ చెప్తున్నారు హీరోలు. ఈ హీరోల లిస్ట్ ఇటీవల బాగానే పెరుగుతుంది. అయితే వీళ్ళలో అందరికంటే ముందు అల్లు అర్జున్(Allu Arjun) ఉంటాడు. అల్లు అర్జున్ స్టేజీలపై డైరెక్ట్ గా నా ఆర్మీ అంటూ ఫ్యాన్స్ గురించి మాట్లాడాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ బన్నీని ఎవ్వరు ఏమన్నా ఊరుకోకుండా సోషల్ మీడియాలో బూతులతో పడిపోతున్నారు.

ఇప్పుడు ఆ కోవలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేరారు. సాధారణంగా తమ హీరోలని తిడితే ఫ్యాన్స్ తిట్టడం గతంలో సాధారణమే కానీ ఇప్పుడు అది శృతిమించిపోయింది. గతంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగానే ఉండే వాళ్ళు. RRR సినిమాలో చరణ్ కి ఎక్కువ పేరొచ్చిందని, ఎన్టీఆర్ కి చిన్న రోల్ ఇచ్చారని అప్పట్నుంచి గొడవలు మొదలుపెట్టి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి, చరణ్ కి వ్యతిరేకంగా పోస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇక రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఆ హీరోకి ఫ్లాప్ వస్తుందనే సెంటిమెంట్ ఎప్పట్నుంచో ఉంది. దీంతో ఎలాగైనా దేవర(Devara) సినిమా హిట్ చేయాలని ఫ్యాన్స్ అంతా కంకణం కట్టుకున్నారు.

Also Read : Devara : దేవర 10 డేస్ కలెక్షన్స్ ..ఎన్టీఆరా..మజాకా

దేవర సినిమాకు తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా రిలీజ్ కి నెలరోజుల ముందే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే పాసులు లేకపోతే పర్మిషన్ ఉండదు అని తెలిసినా వేల మంది తరలి వచ్చి రసాభాస చేసి హోటల్ ప్రాపర్టీ డ్యామేజీ చేసి లక్షల నష్టం మిగిల్చి చివరికి ఈవెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేసారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఇక దేవర రిలీజయి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ భారీగా పెంచిన రేట్లతో, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సినిమా గురించి గొప్పగా చేసిన ప్రమోషన్స్ తో కలెక్షన్స్ సాధించి వారం రోజులకు బ్రేక్ ఈవెన్ అయింది. దసరా సెలవులు రావడంతో కలెక్షన్స్ ఇంకొంచం పెరిగి మూవీ యూనిట్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక సినిమా కలెక్షన్స్ రావడంతో ఫ్యాన్స్ మా సినిమా హిట్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఎవరైనా సినిమా బాలేదు అంటే ఇక వాళ్ళని నానా రకంగా ఫ్యాన్స్ అందరూ ఏకమై తిట్టేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ దేవర రిలీజ్ ముందు వేరే సినిమా ఈవెంట్స్ లో నా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేస్తాను అని చెప్పి అప్పట్నుంచి ఏ అవకాశం వచ్చిన ఫ్యాన్స్ ని పొగుడుతూనే ఉన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినప్పుడు, దేవర సక్సెస్ ఇంటర్వ్యూలో అన్ని చోట్ల ఫ్యాన్స్ పై ప్రశంసలు కురిపించాడు. సాధారణంగా అందరు హీరోలు చేసే పనే ఇది. కానీ ఈ మధ్య కొంచెం డోస్ పెంచి ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నారు హీరోలు. దీంతో ఎన్టీఆర్ వరుసగా ఫ్యాన్స్ గురించి మాట్లాడటం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రూపులుగా తయారయి సోషల్ మీడియాలో దేవరని డిఫెండ్ చేయడం, ఎన్టీఆర్ ని, సినిమాని ఏమన్నా అంటే బూతులతో చెలరేగిపోవడం చూస్తుంటే అల్లు అర్జున్ లాగే ఎన్టీఆర్ కూడా ఆర్మీ తయారుచేసుకుంటున్నాడా? ఆల్రెడీ చేశాడా అని పలువురు నెటిజన్లు, వేరే హీరోల ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్ వార్స్ అనేవి ఎన్టీఆర్ – ఏఎన్నార్ కాలం నుంచే ఉన్నా లిమిట్ లో ఉండేవి. ఇప్పటికి చాలా మంది హీరోల ఫ్యాన్స్ తమ హీరోని ప్రమోట్ చేసుకుంటారు తప్ప వేరే హీరోలని, హీరో ఫ్యాన్స్ ని బూతులతో దూషించారు వాళ్ళు అలా దూషించేవారకు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్లో విచ్చలవిడి సోషల్ మీడియా వాడకంతో ఫ్యాన్ వార్స్ ముఖ్యం అన్నట్టు చేస్తున్నారు కొంతమంది అభిమానులు. మరి హీరోలు ఆర్మీలను తయారుచేసుకోకుండా వాళ్ళ ఫ్యాన్స్ ని కేవలం వారి కలెక్షన్స్ కోసమో, వారి సినిమాల ప్రమోషన్స్ కోసమో కాకుండా కొన్ని మంచి పనులు, మంచి మార్గంలో నడవడానికి కూడా మాట్లాడితే మంచిదే. అయితే ఇలా ఫ్యాన్ వార్స్, ఆర్మీలు అంటూ చేసేది కొంతమందే. చాలా మంది అభిమానులు అభిమానం ఉన్నా సినిమా వరకు చూపించి ఆ తర్వాత తమ పని తాము చేసుకుంటారు తప్ప ఇలా ఖాళీగా ఉండి ఫ్యాన్ వార్స్ చేసి వేరే ఫ్యాన్స్ మీద బూతులతో రెచ్చిపోవడం లాంటివి చేసేది తక్కువమందే. మున్ముందు సోషల్ మీడియాలో ఎన్ని ఆర్మీలు వస్తాయో, ఏ హీరోలు ఆర్మీలు తయారుచేసుకుంటారో చూడాలి. చాలా మంది హీరోలు మేము మేము బాగానే ఉంటాం అని పలుమార్లు చెప్పినా ఫ్యాన్స్ మాత్రం ఫ్యాన్ వార్స్ ఆపట్లేదు.

 

Also Read : Nagarjuna : మొన్న సురేఖ..నేడు రఘునందన్..నాగ్ ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్..?