Site icon HashtagU Telugu

War 2 : ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ..?

War 2 Telugu

War 2 Telugu

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ (War 2) ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇందులో ముఖ్య పాత్రలో నటించడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఇందులో ఉండడంతో ఈ సినిమా నేషనల్ లెవెల్లో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రేజీ ప్రాజెక్టును యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సాధారణంగా ఈ బ్యానర్ తమ సినిమాలను దేశవ్యాప్తంగా సొంతంగా విడుదల చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదల హక్కులను అమ్మాలని నిర్ణయించింది.

Raja Singh : కాంగ్రెస్‌లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్

తెలుగు మార్కెట్‌లో ఎన్టీఆర్ క్రేజ్‌ను బట్టి ‘వార్ 2’ రైట్స్‌ను పొందేందుకు పలువురు ప్రముఖులు ఆసక్తిని చూపారు. అయితే ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. నాగ వంశీ ఈ పోటీలో ముందున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగ వంశీ, ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ సినిమాను సొంతం చేసేందుకు సిద్ధమయ్యారు. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమా తెలుగు రైట్స్‌కు రూ. 100 కోట్లు డిమాండ్ చేస్తున్నా, నాగ వంశీ రూ. 80 కోట్లకు డీల్ ఫైనల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని సమాచారం. ఈ డీల్ ఫైనల్ అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేసే హక్కులు నాగ వంశీకి దక్కనున్నాయి.

Ola-Uber : ఉబర్‌ , ఓలా వంటి సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్

ఇక చిత్రీకరణ విషయానికి వస్తే.. ప్రస్తుతం ముంబైలో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్‌లపై ఓ భారీ డాన్స్ నెంబర్ ను చిత్రీకరిస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ లిస్ట్‌లో ఇద్దరూ టాప్ ప్లేస్‌లో ఉంటారు. వీరిద్దరిపై తెరకెక్కుతున్న ఈ స్పెషల్ సాంగ్‌కు సంగీత దర్శకులు సైతం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తోంది. బ్రహ్మాస్త్ర వంటి విజయం తర్వాత అయాన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ స్పై యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా మరో స్పెషల్ ట్రీట్‌గా నిలవనుంది.