Pooja Hegde: ప్రతి రూమర్ కు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు: పూజాహెగ్డే రియాక్షన్

బుట్టబొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde) పై ఇటీవల కాలంలో రూమర్స్ (Rumours) ఎక్కువగా వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - April 19, 2023 / 01:03 PM IST

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde) పై ఇటీవల కాలంలో రూమర్స్ (Rumours) ఎక్కువగా వినిపిస్తున్నాయి. పలానా డైరెక్టర్ తో డేటింగ్ లో ఉందని, ఓ బాలీవుడ్ హీరోతో రిలేషన్ షిప్ లో ఉందనీ, ఓ టాలీవుడ్ నిర్మాత లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడనే వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆమె 57 ఏళ్ల సల్మాన్ ఖాన్‌ (Salman Khan) తో డేటింగ్‌ (Dating)లో ఉందనే పుకార్లు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. దీనిపై పూజాహెగ్డేను క్లారిటీ అడిగినప్పుడు, ప్రతి రూమర్‌పై స్పందించాల్సిన అవసరం లేదని పూజా హెగ్డే పేర్కొంది.

“కొన్నిసార్లు ప్రతిస్పందించడం కంటే ప్రశాంతంగా ఉండటం మంచిది” అని ఆమె వివరించింది. ఈ శుక్రవారం థియేటర్లలో “కిసీ కా భాయ్ కిసీ కా జాన్” పాన్ ఇండియా మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కు హాజరైన పూజ పైవిధంగా రియాక్ట్ అయ్యారు. గ‌త ఏడాది పూజాహెగ్డే న‌టించిన రాధేశ్యామ్‌, ఆచార్య‌తో పాటు బీస్ట్‌, స‌ర్క‌స్ సినిమాలు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయాయి. స్టార్ హీరోల‌తో (Star Heros) క‌లిసి న‌టించిన ఈ సినిమాలు బాక్పాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌డంతో ఐరెన్ లెగ్ అంటూ పూజాహెగ్డేపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

స‌ర్క‌స్ త‌ర్వాత కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాతో మ‌రోసారి బాలీవుడ్‌ (Bollywood)లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న‌ది పూజాహెగ్డే. స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టించిన ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న పూజాహెగ్డే గ‌త ఏడాది ఎదురైన వ‌రుస ఫ్లాప్‌ల‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. స‌క్సెస్‌ల‌తో పోలిస్తే ఫ్లాప్‌లే ఎన్నో అనుభ‌వ పాఠాల‌ను నేర్పించాయ‌ని పూజాహెగ్డే అన్న‌ది. న‌ట‌నలో తాను చేసే త‌ప్పుల్ని స‌రిదిద్దుకుంటూప‌రిణితి చూపించ‌డానికి ప‌రాజ‌యాలే బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని గ‌త ఏడాది అర్థం చేసుకున్నాన‌ని చెప్పింది.