Niharika Unfollows: భర్తను అన్ ఫాలో చేసిన నిహారిక.. అసలు మ్యాటర్ ఇదే!

మెగా డాటర్ నిహారిక కొణిదెల భర్త చైతన్యతో విడిపోతుందా?

Published By: HashtagU Telugu Desk
Niharika

Niharika

Niharika Unfollows: టాలీవుడ్ లో మరో జంట విడాకులు (Divorce) తీసుకోబోతుందా? మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika) భర్త చైతన్యతో విడిపోతుందా? లాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వారి విడాకుల గురించి అధికారిక ప్రకటన లేదు. కానీ నిహారిక, ఆమె భర్త ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కావడం లేదు. ఈ జంట విడిపోతున్నట్టు మీడియాలో  చాలా వారాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అటు నిహారిక కానీ, అటు చైతన్య కానీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు.

నిహారిక (Niharika) భర్త ఆమెను అన్‌ఫాలో (UnFollow) చేసి, తన ఇన్‌స్టాగ్రామ్ టైమ్‌లైన్ నుండి ఆమె ఫోటోలను తొలగిస్తే, తాజాగా నిహారిక వంతు వచ్చింది. నిన్న ఆమె తన భర్త,  వివాహానికి సంబంధించిన అన్ని ఫోటోలను తొలగించింది. ఆమె పెళ్లికి సంబంధించిన ఒకే ఒక్క ఫోటో ఉంది, కానీ అది సోలో షాట్ మాత్రమే. వారు విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే నిహారిక కొణిదెల నిర్మాతగా కూడా బిజీ అయిపోయింది. ఆమె OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం విభిన్న కంటెంట్‌ని సృష్టించాలని (Niharika) భావిస్తోంది.

Also Read: WebSites Hacking: రోజుకు ఎన్ని కోట్ల వెబ్ సైట్స్ హ్యాక్ అవుతున్నాయో తెలుసా!

  Last Updated: 11 Apr 2023, 12:41 PM IST