Nani Yellamma : నాని ఎల్లమ్మ.. కన్ఫర్మ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..!

Nani Yellamma బలగంతో డైరెక్టర్ గా సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి. తన సెకండ్ ప్రాజెక్ట్ నానితో చేస్తాడన్న వార్తలు కొన్నాళ్లుగా మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. వేణు ఎల్లమ్మ టైటిల్ తో నానితో సినిమా చేస్తాడని

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 11:35 AM IST

Nani Yellamma బలగంతో డైరెక్టర్ గా సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి. తన సెకండ్ ప్రాజెక్ట్ నానితో చేస్తాడన్న వార్తలు కొన్నాళ్లుగా మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. వేణు ఎల్లమ్మ టైటిల్ తో నానితో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఆశిష్ రెడ్డి లవ్ మీ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న దిల్ రాజు నాని వేణు కాంబో సినిమా కన్ ఫర్మ్ చేశారు. సినిమా టైటిల్ కూడా ఎల్లమ్మ అని పెట్టినట్టు చెప్పారు.

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నాని సినిమా సినిమాకు డిఫరెంట్ కథలతో మెప్పిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో సక్సెస్ అందుకున్న నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

సరిపోదా శనివారం సినిమా రిలీజ్ తర్వాత నాని వేణు కాంబో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఎల్లమ్మ కథ ఏంటిల్.. బలగం తర్వాత వేణు చెప్పబోతున్న మరో కథ ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటూ ఆడియన్స్ లో సూపర్ ఎగ్జైట్ మెంట్ ఏర్పడింది. నాని ఓకే అన్నాడు అంటే తప్పకుండా కథ కచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నారు ఆడియన్స్.

Also Read : Deepika Padukone : ప్రభాస్ తర్వాత పుష్ప రాజ్ తో దీపికా.. సౌత్ లో పాగా వేయాలనుకుంటున్న అమ్మడు..!