Rashmika Mandanna: రష్మికను గన్ తో బెదిరించిన నాని.. అసలు ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మిక మందన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్,కోలీవుడ్ సినిమాలలో నటి

  • Written By:
  • Updated On - March 27, 2024 / 10:50 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మిక మందన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్,కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. చలో సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగశౌర్య లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఆ తర్వాత రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తూ అదరగొడుతోంది రష్మిక. తెలుగు, తమిళం హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన్నకు సంబందించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో రష్మిక మందన్నాను నేచురల్ స్టార్ నాని గాన్ తో బెదిరిస్తూ కనిపించారు. నాని రష్మిక కలిసి ఒక సినిమాలో నటించారు. దేవదాసు అనే సినిమాలో రష్మిక, నాని కలిసి నటించారు.

 

ఇదే సినిమాలో నాగార్జున కూడా నటించారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతోన్న వీడియో ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలోది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో నాని రష్మికాను నీ ఫెవరెట్ కో స్టార్ ఎవరు అని అడిగారు. దాంతో నాగార్జున కూడా రష్మికాను బెదిరించారు. విజయ్ దేవరకొండ, నాగ శౌర్య , నాని ఈ ముగ్గురిలో ఎవరు నీ ఫెవరెట్ అని అడిగారు. రష్మిక తడబడుతుంటే నాని అక్కడ టేబుల్ పై ఉన్న గాన్ తో ఆమెను బెదిరించారు. దాంతో రష్మిక నాని పేరు చెప్పింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.