Site icon HashtagU Telugu

Naga Chaitanya Dating: సమంతతో బ్రేకప్, శోభితతో డేటింగ్.. చైతూ రిలేషన్ స్టేటస్

Naga Chaitanya

Naga Chaitanya

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోయి చాలా కాలం అవుతున్న విషయం తెలిసిందే. అయితే డివోర్స్ తర్వాత సమంత నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తున్నప్పటికీ, చైతూ మాత్రం సమంతతో బ్రేకప్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ సమంత విడిపోయాక ఈ హీరో శోభితా ధూళిపాళతో డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ 2021లో సమంతా నుండి చైతన్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి సుమారు 11 నెలల కావోస్తుంది. సరిగ్గా ఆరు నెలల క్రితం క్రితం చైతూ, శోభిత డేటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.

రీసెంట్ గా లండన్ రెస్టారెంట్‌లో ఈ జంట కనిపించడంతో  ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గతంలో ఈ జంట పలు పంక్షన్లు, హోటళ్లలో ఏకాంతంగా కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక శోభిత కూడా నాగచైతన్య ఇంటికి తరుచుగా వస్తున్నట్టుగా వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే నాగ చైతన్య, శోభితా ధూళిపాళ మొదట్లో ఫ్రెండ్స్ మాత్రమే. పరిచయం ప్రేమగా మారి డేటింగ్ కు దారితీసిందని సమాచారం. అయినప్పటికీ తమ రిలేషన్ పై ఈ జంట ఇప్పటి వరకు ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే డివోర్స్ తర్వాత ఈ హీరో శోభిత తో డేటింగ్ కొనసాగిస్తుంటే.. సమంత మాత్రం అభిమానులే నా ప్రేమికులు అని అంటోంది.

Also Read: IPL 2023 Opening Ceremony LIVE: ఐపీఎల్ కు గ్లామర్ షో.. రష్మిక, తమన్నా లైవ్ డాన్స్