Shyam Babu Video : ‘శ్యామ్ బాబు’ పూర్తి వీడియో వచ్చేసింది..చూస్తారా..?

శ్యామ్ బాబు క్యారెక్టర్ ద్వారా నటుడు పృద్వికి ఎన్నడూ లేని గుర్తింపు వచ్చింది

Published By: HashtagU Telugu Desk
My Dear Markandeya Video Song

My Dear Markandeya Video Song

బ్రో (BRO) మూవీ లో పవన్ కళ్యాణ్ , సాయి తేజ్ , సముద్రఖని లకు ఎంత పేరు వచ్చిందో తెలియదు కానీ..శ్యామ్ బాబు (BRO Shyam Babu) క్యారెక్టర్ ద్వారా నటుడు పృద్వికి ఎన్నడూ లేని గుర్తింపు వచ్చింది. ఈ శ్యామ్ బాబు..పేరు గత వారం క్రితం వరకు ఎంతలా మారుమోగిపోయిందో మరోసారి చెప్పాల్సిన పనిలేదు. సినిమా క్యారెక్టర్ కాస్త రియల్ క్యారెక్టర్ కు వెళ్లింది. తనను పోలిన క్యారెక్టర్ లో నటుడు ఫృథ్వీ నటించాడని సాక్ష్యాత్తు ఏపీ మంత్రి అంబటి రాంబాబు (AP Minister Ambati Rambabu) మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టాడు.

మీ క్యారెక్టర్ కదండీ అని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చిన లేదు..లేదు అది నా క్యారెక్టరే..నేను వేసుకున్న టీ షర్టే పృద్వి వేసుకున్నాడు..నేను వేసుకున్న షూ లాంటివే పృద్వికి వేశారని రాంబాబు నానా రచ్చ చేసారు. ఆ తర్వాత రోడ్ల ఫై నిరసనలు , పవన్ కళ్యాణ్ ఫై మీము సినిమాలు చేస్తున్నామని అంబటి రాంబాబు చెప్పడం..పలు టైటిల్స్ ప్రకటించడం..ఆ తర్వాత మీము ఎమన్నా తక్కువా అని జనసేన నేతలు సైతం రాంబాబు ఫై సినిమా స్టార్ట్ చేయడం..పలు టైటిల్స్ ప్రకటించడం ఇలా నానా రభసే జరిగింది. ఇప్పుడిప్పుడే దీని గురించి మాట్లాడుకోవడం తగ్గించారో లేదో..మరోసారి దీని గురించి అంత మాట్లాడుకునేలా మేకర్స్ ఈ ఫుల్ సాంగ్ (My Dear Markandeya Video Song) రిలీజ్ చేసారు. మరి మళ్లీ లొల్లి స్టార్ట్ అవుతుందో చూడాలి.

Read Also: Ananya Pandey : చీర కట్టులో మెరిసిపోతున్న లైగర్ భామ

  Last Updated: 16 Aug 2023, 09:18 PM IST