AR Rahman : ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత 58 ఏళ్ల ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. రెహమాన్(AR Rahman) ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం రెహమాన్‌కు చికిత్స అందిస్తోంది. తొలుత ఆయనకు యాంజియోగ్రామ్ చేశారు. తదుపరిగా రెహమాన్‌కు యాంజియో ప్లాస్టీ నిర్వహించారని తెలిసింది. ఏఆర్ రెహమాన్ రంజాన్ ఉపవాసాలను పాటిస్తున్నందున డీ హైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
Also Read :Sunita Williams : 19న భూమికి సునితా విలియమ్స్.. ఈ ఆరోగ్య సమస్యల గండం
లండన్ నుంచి తిరిగొచ్చాక..
ఇటీవలే ఏఆర్ రెహమాన్ లండన్ పర్యటన ముగించుకొని భారత్‌కు తిరిగొచ్చారు. లండన్‌లో జరిగిన ప్రఖ్యాత మ్యూజిక్ అకాడమీ అవార్డుల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ సంగీతంలో రాణించాలని భావిస్తున్న యువతను ఉద్దేశించి రెహమాన్ ప్రసంగించారు. సంగీత నైపుణ్యాలను పెంచుకోవడంపై వారికి సందేశం ఇచ్చారు. లండన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారని తెలిసి సినీ, సంగీత ప్రియులు షాక్‌కు గురయ్యారు. రెహమాన్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
Also Read :Saudi Arabia T20 : గ్రాండ్ శ్లామ్ తరహాలో టీ20 లీగ్.. రూ.4,300 కోట్లతో సౌదీ రెడీ
అవార్డుల్లో ఘనుడు
ఏఆర్ రెహమాన్ సాధించిన ప్రఖ్యాత అవార్డులు ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాలో.. 6 జాతీయ ఫిల్మ్ అవార్డులు, 2 అకాడమీ అవార్డులు, 2 గ్రామీ అవార్డులు, 1 బాఫ్టా అవార్డు, 1 గోల్డెన్ గ్లోబ్ అవార్డు, 6 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, 18 ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఉన్నాయి. 2010లో ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.