Mrunal Thakur Glamour Attack అదేంటో మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ వెళ్తే చాలు గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. బాలీవుడ్ సీరియల్స్ చేస్తూ అక్కడ సినిమాల్లో అవకాశం అందుకున్న మృణాల్ సీతారామం తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న అమ్మడు లాస్ట్ ఇయర్ నానితో హాయ్ నాన్న సినిమాలో నటించింది.
We’re now on WhatsApp : Click to Join
అది కూడా సక్సెస్ అవ్వడంతో మృణాల్ కి తిరిగులేకుండా పోయింది. ప్రస్తుతం అమ్మడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రెండు క్రేజీ సినిమాలు లైన్ లో ఉన్నట్టు టాక్.
ఇదిలాఉంటే టాలీవుడ్ లో లవ్ స్టోరీస్, ఎమోషనల్ కథలు చేస్తున్న మృణాల్ బాలీవుడ్ లో మాత్రం అలాంటి కథలు రావట్లేదని బాధపడుతుంది. ఇక లేటెస్ట్ గా జరిగిన ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ లో మృణాల్ మైండ్ బ్లాక్ చేసే అందాలతో మెస్మరైజ్ చేసింది. శారీ లోనే కనిపించినా తన పరువాలన్నీ ప్రదర్శిస్తూ బాబోయ్ అనిపించేలా చేసింది. బాలీవుడ్ మేకర్స్ దృష్టి ఆకర్షించే ప్రయత్నంలో మృణాల్ ఒక రేంజ్ లో ప్రయత్నాలు చేస్తుంది.
అయితే అమ్మడికి తెలుగులో క్లాస్ ఇమేజ్ ఉండగా ఇక్కడ బాగానే ఉంటుంది అదేంటో అక్కడకు వెళ్లగానే ఆ నీళ్ల వల్లో ఏమో గ్లామర్ షోతో హడావిడి చేస్తుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో మృణాల్ గ్లామర్ షో చూసి అందరు వావ్ అనేస్తున్నారు. మరి తను కోరుకుంటున్న బాలీవుడ్ మేకర్స్ ఐడెంటిటీ ఈ షోతో వస్తుందేమో చూడాలి.
మృణాల్ ఠాకూర్ లోని టాలెంట్ ని బాలీవుడ్ ఇంకా గుర్తించలేదని చెప్పొచ్చు. తనని కేవలం రొమాంటిక్ సినిమాలకే తీసుకుంటున్నారని. తను కూడా లవ్ స్టోరీస్ చేస్తానని రీసెంట్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే అక్కడ ఈ రేంజ్ లో రెచ్చిపోయి బోల్డ్ ఇమేజ్ తెచ్చుకుంటున్న అమ్మడితో ప్రేమకథలు ఎలా తీస్తారన్నది ఆలోచించాలి.
Also Read : Sohail : యాంకర్ సుమ కాళ్ల మీద పడబోయిన హీరో.. ఆమె చేసిన సాయం అలాంటిదంటూ..!
