మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం హాట్ బ్యూటీ, బాలీవుడ్ నటిని మౌని రాయ్(Mouni Roy) రంగంలోకి దిగారు. ఇది ఆమె తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇప్పటివరకు హిందీ సినిమాలు తెలుగులో డబ్బింగ్ రూపంలో వచ్చినప్పటికీ, నేరుగా తెలుగులో నటించడం ఇదే మొదటిసారి. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మౌనికి ఎంతో గర్వకారణంగా మారింది.
తాజాగా చిరంజీవి కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు చేరగా, రెండు రోజుల విశ్రాంతి తర్వాత ‘విశ్వంభర’లో మౌని రాయ్‌తో కూడిన స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఈ పాటను మూడు-నాలుగు రోజుల పాటు చిత్రీకరించనున్నారు. మౌని రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌లోని లొకేషన్ ఫోటోలు, టీంతో దిగిన సెల్ఫీలు షేర్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
Non-veg Food: శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదా? కారణాలీవే?!
ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, స్పెషల్ సాంగ్‌కు యువ సంగీత దర్శకుడు భీమ్స్ స్వరాలు అందిస్తున్నారు. చిరు సాంగ్స్‌కి ప్రత్యేక క్రేజ్ ఉండగా, ‘అన్నయ్య’లో ‘ఆట కావాలా పాట కావాలా’ తరహాలోనే ఈ పాటను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజిషన్ చేస్తున్నారు. మౌని – చిరు కాంబినేషన్‌ను తెరపై చూడాలనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష మరియు ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ పాత్రలో కనిపించనుండగా, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.