Site icon HashtagU Telugu

Bellamkonda Suresh : ఆ హీరో తండ్రి కారులో భారీ చోరీ.. విలువైన మద్యం సీసాలు ఎత్తుకెళ్లిన దొంగలు..

Money and Liquor Bottles stolen in Bellamkonda Suresh Car

Money and Liquor Bottles stolen in Bellamkonda Suresh Car

హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh) కారులో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్(Hydeerabad) జూబ్లీహిల్స్ లో బెల్లంకొండ సురేష్ కారులో చోరీ అయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ సురేష్ కి సంబంధించిన సాయిగణేష్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ కార్యాలయం ఉంది. గురువారం మధ్యాహ్నం సురేష్ కి చెందిన బెంజి కారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం చూడగా కారు ఎడమవైపు వెనుక సీటు వద్ద అద్దం పగిలి ఉంది. అయితే ఆ కారులో కొంత నగదు, కొన్ని విదేశీ విలువైన మద్యం సీసాలను ఉంచారు. దొంగలు కారు అద్దం పగులగొట్టి ఆ నగదు, ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు.

50వేల నగదు, ఒక్కో మద్యం సీసా విలువ రూ.28వేలు ఉన్న 11 ఖరీదైన మద్యం సీసాలు దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో నిర్మాణ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read : NBK 109 : బర్త్‌డే రోజు బాలయ్య సర్‌ప్రైజ్.. NBK 109 సినిమా ఓపెనింగ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?