Liger Scam: ఈడీకి చేరిన ‘లైగర్’ స్కామ్!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లైగర్ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - September 6, 2022 / 02:41 PM IST

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లైగర్ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో లైగర్ టీం పై అంతటా విమర్శలు వెల్లువెత్తాయి. విడుదల సమయంలో లైగర్ కు బాయ్ కాట్ సెగ తగలగా, తాజాగా మరో వివాదానికి దారితీసింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు పొలిటికల్ సపోర్ట్ కూడా ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. టాలీవుడ్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఈ యూత్ హీరో ఏకంగా ప్యాన్ ఇండియా మూవీ చేయడం అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఆయన సినిమా వెనుక పొలిటికల్ లీడర్స్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లైగర్ లో కవిత అక్రమ పెట్టుబడులు

ఇప్పటికే ఢిల్లీ మద్యం స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు వినిపించిన విషయం తెలిసిందే. ఈ విషయం మరవకముందే, లైగర్ సినిమాలో అక్రమ పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా బక్క జడ్సన్ మీడియాతో మాట్లాడారు. అక్రమ పెట్టుబడులు పెడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని  ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు పెట్టారని ఆయన ఈడీకి ఫిర్యాదు తెలిపారు. బ్లాక్ మనీని, వైట్ మనీగా మార్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత లైగర్ సినిమాలో పెట్టుబడి పెట్టిందని జడ్సన్ ఆరోపించారు.  దీనిపై విచారించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈడీని కోరారు.

విజయ్ కోసం ‘మై హోం గ్రూప్స్’

ఇదిలా ఉండగా రియల్ ఎస్టేట్ లో పేరుగాంచిన మై హోం గ్రూప్స్ కూడా విజయ్ దేవరకొండ తో సినిమాలు చేసేందుకు ముందుకురావడం హాట్ టాపిక్ గా మారింది. జనగణమన సినిమా కోసం రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. విజయ్ దేవరకొండ సినిమాల కోసం పొలిటికల్ లీడర్స్ పెట్టుబడులు పెడుతున్నారా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి.