Mega Family Donated 9.4 Crore : చిత్రసీమలో మెగా ఫ్యామిలీ (Mega Family) కి ఎంతో గుర్తింపు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టిన చిరంజీవి(Chiranjeevi)..ఇప్పుడు ఇండస్ట్రీ కే పెద్ద దిక్కయ్యాడు. కేవలం ఆయనే కాదు ఆయన కుటుంబం నుండి కూడా దాదాపు డజన్ మంది చిత్రసీమ(Tollywood)లో అడుగుపెట్టారు. వీరంతా చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన..ఎవరికీ వారే స్వశక్తి తో రాణిస్తున్నారు. అంతే కాదు ఎలాంటి విపత్తులు వచ్చిన తమకు తోచిన సాయం అందించడంలో మెగా హీరోలు ముందుంటారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ , వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరు ఆర్ధిక సాయం చేస్తూ..మీకు మేమున్నాం అంటూ భరోసా ఇస్తుంటారు. గడిచిన 30 రోజుల్లో దాదాపు రూ.9.4 కోట్ల విరాళం ఇచ్చి తమ గొప్ప మనసును చాటుకున్నారు.
ఎలాంటి ఆపద వచ్చిన మెగా ఫ్యామిలీ ముందు
తాజాగా తెలుగు రాష్ట్రాలకు (Telugu States) పెద్ద ఆపద వచ్చిన సంగతి తెలిసిందే. వారం క్రితం కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో ఎంతోమంది నిరాశర్యులయ్యారు. ప్రభుత్వం తో పాటు ఎవరైనా దాతలు తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే రెండు ప్రభుత్వాలు తమ వంతు సాయం చేయడం చేస్తుండగా..ఇటు చిత్రసీమ ప్రముఖులు , పలు రంగాల వారు తమకు తోచిన సాయం అందజేస్తూ వస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కళ్యాణ్ రూ.6 కోట్లు, చిరంజీవి, రామ్ చరణ్ చెరో కోటి, సాయి దుర్గ తేజ్ రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ రూ. 15 లక్షలు ఇవ్వగా కేరళ వరదలకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.కోటి అందించారు. ఇవి కాక మెగాస్టార్ చిరంజీవి విడిగా పలు దాతృత్వ కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. ఇలా ఎలాంటి ఆపద వచ్చిన మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చి సాయం అందించడం పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
Read Also : Game Changer : శంకర్, దిల్ రాజు పై చరణ్ అభిమానుల ఆగ్రహం.. నెట్టింట నెగటివ్ ట్రెండ్..