SSMB29 Leak : ఎస్ఎస్ఎంబీ-29 సినిమా గురించి మరో బ్రేకింగ్ అప్‌డేట్ వచ్చింది. రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వస్తున్న ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ వీడియోను ఎవరు తీశారు అనేది తెలియరావడం లేదు. దీన్ని చూసిన ఎస్ఎస్ఎంబీ-29 చిత్రయూనిట్ అవాక్కైంది. లీకైన ఎస్ఎస్ఎంబీ-29 షూటింగ్ వీడియో విషయానికి వస్తే.. అందులో మహేశ్ బాబు నడుచుకుంటూ వస్తున్నారు. మరో వ్యక్తి ఆయన్ను ముందుకు తోస్తున్నాడు. చివరికి చక్రాల కుర్చీలో కూర్చున్న ఓ వ్యక్తి ఎదుట మహేశ్‌బాబు(SSMB29 Leak) మోకాళ్లపై కూర్చున్నారు. ఒడిశాలోని కోరాపుత్ జిల్లాలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. వైరల్ అయిన షూటింగ్ వీడియో అక్కడిదే అని తేలింది.
Also Read :Pasola Festival: పచ్చని పొలాల్లో పసోలా పండుగ.. పెద్ద యుద్ధమే!!
కోరాపుత్ జిల్లాలో..
కోరాపుత్ జిల్లా పరిధిలో గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందు హైదరాబాద్‌లోని ఒక అల్యూమినీయం ఫ్యాక్టరీలో షూటింగ్ చేశారు. ఈ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన షూటింగ్ సెట్ వీడియో ఇప్పటికే లీకై చర్చనీయాంశంగా మారింది. దాన్ని మరువక ముందే ఒడిశాలోని కోరాపుత్‌లో షూటింగ్ చేస్తున్న వీడియో బయటికి వచ్చేసింది. మొత్తం మీద ఒడిశాలో షూటింగ్ ముగియగానే విశాఖకు.. అక్కడి నుంచి శ్రీలంక, కెన్యా దేశాలకు ఎస్ఎస్ఎంబీ-29 మూవీ యూనిట్ వెళ్తుందని సమాచారం.
Also Read :Milk: పాలు తాగితే బరువు పెరుగుతార.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
ప్రియాంకా చోప్రా కీలకపాత్ర
ఎస్ఎస్ఎంబీ 29 మూవీ షూటింగ్ షురూ అయినప్పటి నుంచి ఈ సినిమా కథపై అంతటా చర్చ జరుగుతోంది. ఎంత బడ్జెట్‌తో ఈ మూవీ తీస్తున్నారో ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే రాజమౌళి అంతగా గోప్యత పాటిస్తున్నారు. ఈ మూవీలో ప్రియాంకా చోప్రా కీలకపాత్ర పోషిస్తారని తెలిసింది. ఈ మూవీ యూనిట్ చిలుకూరి బాలాజీ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో ప్రియాంకపై గాసిప్స్ వైరల్ అయ్యాయి. మహేశ్‌బాబు పాస్‌పోర్ట్‌ని లాక్ చేసి, సింహాన్ని బోనులో బంధిస్తూ రాజమౌళి రిలీజ్ చేసిన వీడియోకు ప్రియాంక లైక్ కొట్టి కామెంట్ పెట్టారు. దీంతో ఈ సినిమాలో ఆమె ఉన్నారనే అంచనాలు బలపడ్డాయి. అయితే ఆమె పాత్రపై ఎవరికీ క్లారిటీ లేదు.