Sitara First Ad : మహేష్ కూతురు సితార జ్యువెల్లరీ యాడ్ చూశారా?? మహారాణిలా మెరిసిపోతూ..

గత కొన్ని రోజులుగా సితార ట్రెండింగ్ లో ఉంది. ఇక సితార మీద చేసిన యాడ్ తాజాగా నేడు రిలీజ్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Mahesh Babu Daughter Sitara First Ad goes Vira

Mahesh Babu Daughter Sitara First Ad goes Vira

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూతురు సితార(Sitara) అందరికి పరిచయమే. ప్రస్తుతం సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే సితార ఓ యాడ్ కూడా చేసింది. PMJ జ్యువెల్స్ కి ఓ స్పెషల్ యాడ్ చేసింది సితార. అలాగే సితార పేరుపై ఆ కంపెనీ స్పెషల్ కలెక్షన్స్ కూడా ఇటీవలే లాంచ్ చేశారు.

సితార కలెక్షన్స్ లాంచింగ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా చేశారు. ఆ ఈవెంట్ కి సితార తన తల్లి నమ్రతతో కలసి వచ్చి అలరించింది. ఇక సితార జ్యువెల్లరీ ప్రమోట్ చేస్తున్న ఫోటోలను అమెరికా న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద కూడా ప్రదర్శించారు. దీంతో గత కొన్ని రోజులుగా సితార ట్రెండింగ్ లో ఉంది. ఇక సితార మీద చేసిన యాడ్ తాజాగా నేడు రిలీజ్ చేశారు.

మహేష్ బాబు తన కూతురు చేసిన యాడ్ స్వయంగా రిలీజ్ చేసి తనని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని పోస్ట్ చేసాడు. ఇక ఈ యాడ్ లో సితార ఓణీల ఫంక్షన్ అని, ఆ జ్యువెల్లరీ సంస్థకు వెళ్లి అన్ని కొనుక్కున్నట్టు చూపించారు. సితార ఫస్ట్ యాడ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ యాడ్ కి సితార దాదాపు 70 లక్షల పైనే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

 

Also Read : Sai Dharam Tej : మళ్ళీ ఆరు నెలలు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్న సాయి ధరమ్ తేజ్..

  Last Updated: 19 Jul 2023, 08:40 PM IST