Site icon HashtagU Telugu

MAD Square : మ్యాడ్​ స్క్వేర్ టాక్

Mad 2

Mad 2

‘మ్యాడ్’ (MAD) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square)భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఇక సినిమా చూసిన ఆడియన్స్ సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. పార్ట్ 1 లో ఎలాగైతే కామెడీ అందరినీ ఆకట్టుకుందో..సెకండ్ పార్ట్ కూడా అంతే విధంగా కామెడీ ఉందని అంటున్నారు.

BCCI: టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్‌కు బీసీసీఐ బంప‌రాఫ‌ర్‌.. గ్రేడ్ బీ నుంచి గ్రేడ్ ఏకు ప్ర‌మోష‌న్‌!

ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ ఉందని , ముఖ్యంగా లడ్డూ పాత్ర పోషించిన మురళీధర్ గౌడ్ తన హాస్య నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మ్యారేజ్ ఎపిసోడ్ సినిమా హైలైట్‌గా మారిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రతి సీన్‌లో కామెడీని జొప్పించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. అయితే కొన్ని సన్నివేశాలు బలవంతంగా జోడించినట్లు అనిపించిందని, కొన్ని సందర్భాల్లో కామెడీ నాన్‌సెన్స్‌గా అనిపించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Surya Grahanam 2025 : రేపు సూర్యగ్రహణం

సెకండాఫ్ ఫర్వాలేదనిపించిందని, అయితే మొదటి భాగంతో పోల్చుకుంటే మరింత హాస్యభరితంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్ గా ‘మ్యాడ్’కు తగ్గట్టుగానే ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్ళే ప్రేక్షకులకు ఈ సినిమా సరైన వినోదాన్ని అందిస్తుందని నెటిజన్లు చెబుతున్నారు.