Bigg Boss 6: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే.. ప్రూఫ్ ఇదే?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే 12 ముగింపు దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే 12వ

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 03:00 PM IST

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే 12 ముగింపు దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే 12వ వారం హౌస్ లో నుంచి ఎవరు ఎలిమెంట్ కానున్నారు అన్న విషయం పై సోషల్ సమీడియాలో వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి. 12వ వారం మొత్తం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. రోహిత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, రాజ్, ఇనయ, ఫైమా, శ్రీసత్యలు నామినేషన్స్‌లో ఉండగా, ఇనయ, శ్రీహాన్‌, రోహిత్‌లకు తిరుగులేదు. వాళ్ల ముగ్గురికి మంచి ఓట్లు బాగానే వచ్చాయి. కానీ మెరీనా ఎలిమినేషన్ కావడంతో అతని గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది.

అయితే బిగ్ బాస్ రోహిత్‌కి స్క్రీన్ స్పేస్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం రోహిత్, ఇనయ, శ్రీహాన్ ఈ ముగ్గురూ సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఆదిరెడ్డికి కూడా ఈ వారం పర్వాలేదు అనిపించే విధంగా ఓట్లు పడ్డాయి. ఇక మొత్తానికి పైమా, రాజ్, శ్రీ సత్య ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పైమా తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించుకొని ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకుంటే రాజ్ శ్రీ సత్య లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో ఒక పోలింగ్ నిర్వహించగా అందులో శ్రీ సత్య కి ఊహించని విధంగా స్పందన లభించింది.

శ్రీ సత్య కు 66 శాతం మంది ఆడియన్స్ ఓట్లు పడ్డాయి. మొత్తానికి 12వ వారం శ్రీ సత్య హౌస్ నుంచి తప్పకుండా ఎలిమినేట్ అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఈవారం 12వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా రాజ్ అలాగే శ్రీ సత్య ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. పోలింగ్ లో శ్రీసత్యకి 66 శాతం ఓట్లు, ఆమె తరువాత రాజ్ 12 శాతం ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఆ తరువాతి స్థానంలో ఫైమా 8 శాతం ఓట్లతో ఉంది. రోహిత్ 6 శాతం,ఆదిరెడ్డికి 5 శాతం, ఇనయకి 2 శాతం, శ్రీహాన్ 1 శాతం ఓట్లు పడ్డాయి. కానీ అందరికంటే ఎక్కువ ఓట్లుశ్రీ సత్యకు పడ్డాయి.