Lavanya Caught Raj Tarun – Malvi in Mumbai Hotel Room Red Handedly : రాజ్ తరుణ్..మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra , Raj Tarun )..గత కొద్దీ రోజులుగా మీడియా లో ఈ ఇద్దరి పేర్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కెరియర్ అంతంతమాత్రంగా ఉన్న క్రమంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. షార్ట్స్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాజ్..ఆ తర్వాత ఉయ్యాలా జంపాల మూవీ తో వెండితెర కు హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్న తరుణ్..ఆ తర్వాత వరుస హిట్ల తో అతి తక్కువ టైంలోనే బిజీ హీరో అయ్యాడు. కానీ ఆ తర్వాత కథల ఎంపికలో తప్పటడుగు వేసి వరుస ప్లాప్స్ మూటకట్టుకున్నాడు.
ఇటీవలే ‘తిరగబడర సామి ‘ (Thiragabadara Saami) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది కూడా ప్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమాలో తన సరసన జోడి కట్టిన మాల్వీ మల్హోత్రా తో కొద్దీ నెలలుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇది తట్టుకోలేకపోయిన తన మాజీ లవర్ లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తనను పెళ్లి చేసుకున్నాడని, పదేళ్లుగా సహజీవనం చేసాడని..కడుపు కూడా చేసాడని లావణ్య ..రాజ్ ఫై కేసు పెట్టింది. రీసెంట్ గా పోలీసులు రాజ్ తరుణ్ ఫై ఛార్జ్ షీట్ కూడా ఓపెన్ చేసారు. ఇదిలా ఉంటె తాజాగా రాజ్ తరుణ్ ..ముంబై లోని మాల్వి ఫ్లాట్ లో అడ్డంగా దొరికాడు. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా ఒకే ఫ్లాట్‌లో ఉండగా లావణ్య రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. దీనికి సంబదించిన వీడియో ను కూడా సోషల్ మీడియా లో విడుదల చేసింది.
ఒకే ఫ్లాట్‌లో రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా..రెడ్ హ్యాండ్ పట్టుకున్న లావణ్య
ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. లావణ్య విడుదల చేసిన వీడియోలో రచ్చ ఓ రేంజ్‌లో ఉంది. రాజ్ తరుణ్ తనవాడే అంటూ మాల్వీ మల్హోత్రాతో వాగ్వాదానికి దిగింది లావణ్య. మా ఇద్దరి మధ్య 11 ఏళ్ల రిలేషన్‌షిప్ ఉందంటూ చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్‌ను వదిలేయాలని మాల్వీకి వార్నింగ్ ఇచ్చింది. అయితే గెట్ ఔట్ అంటూ లావణ్యకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది మాల్వీ. రాజ్‌తరుణ్ కూడా అదే ఫ్లాట్‌లో ఉండటాన్ని రికార్డ్ చేసిన లావణ్య.. వాళ్ల మధ్య సంబంధానికి ఈ దృశ్యాలే సాక్ష్యమంటోంది. అయితే లావణ్య తమను ఇబ్బందిపెడుతోందంటూ మాల్వీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లావణ్య తండ్రిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంతా రాజ్ తరుణ్ ఇప్పుడేం సమాధానం చెపుతావు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమందేమో..అసలే ఛాన్సులు లేవు..ఎందుకు ఈ సమయంలో ఈ వివాదాలు అని పేర్కొంటున్నారు. మరి దీనిపై రాజ్ ఏమంటాడో..!!
Read Also : Amit Shah: జమ్మూకశ్మీర్‌లో గెలిచేందుకు బీజేపీ కొత్త ప్లాన్‌లు..!