Actress Soundarya: మోహన్ బాబు గురించి సౌందర్య భర్త కీలక కామెంట్స్

నటి  సౌందర్య(Actress Soundarya) బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి 2004 ఏప్రిల్ 17న సెస్నా 180 హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి కరీంనగర్‌కు బయలుదేరారు.

Published By: HashtagU Telugu Desk
Actress Soundaryas Husband Raghu Actor Mohan Babu

Actress Soundarya: నటుడు మోహన్ బాబుపై ఇటీవలే  ఖమ్మం జిల్లాలో ఓ  వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఒక నటుడు నివసిస్తున్న శంషాబాద్‌లోని 6 ఎకరాల  జల్‌పల్లి గెస్ట్ హౌస్ కోసం దివంగత నటి సౌందర్యను హత్య చేయించారని ఫిర్యాదులో ఆరోపించాడు. ఆ గెస్ట్ హౌస్‌ను విక్రయించమని మోహన్ బాబు అప్పట్లో కోరారని, దానికి సౌందర్య సోదరుడు అమర్‌నాథ్ నిరాకరించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. సెస్నా 180 హెలికాఫ్టర్ కూలడంతో సౌందర్య  చనిపోయారు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత మోహన్ బాబుపై ఫిర్యాదు రావడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Also Read :Yogi Adityanath: ‘‘ఇస్లాం పుట్టక ముందే ‘సంభాల్’.. 1526లో ఆలయాన్ని కూల్చేశారు’’

మోహన్ బాబుకు, మాకు ఆస్తి లావాదేవీలు లేవు

ఈ నేపథ్యంలో సౌందర్య భర్త రఘు స్పందించారు. ‘‘హైదరాబాద్‌లోని ఒక ప్రాపర్టీకి సంబంధించి మోహన్ బాబు, సౌందర్య పేర్లను కొంతమంది అనవసరంగా ప్రస్తావిస్తున్నారు. ప్రాపర్టీ గురించి ఇవన్నీ ఆధారాలు లేని వార్తలే. నా భార్యకు చెందిన ఎలాంటి ఆస్తిని మోహన్ బాబు ఇల్లీగల్‌గా స్వాధీనం చేసుకోలేదు’’ అని రఘు తేల్చి చెప్పారు. ‘‘నాకు తెలిసినంతవరకు మోహన్ బాబుకు, మాకు ఆస్తి లావాదేవీలు లేవు. సౌందర్య మరణించిన తర్వాత కూడా నాకు, మోహన్ బాబు గారితో మంచి స్నేహమే ఉంది. నా భార్య, అత్తగారు, బావమరిది ఎప్పుడూ మోహన్ బాబుతో మంచిగా ఉండేవారు. దయచేసి మోహన్ బాబు గురించి తప్పుడు ప్రచారం చేయొద్దు. వాటిని మీడియాలో ప్రచురించకండి’’ అని ఒక లేఖ ద్వారా సౌందర్య భర్త తెలిపారు.

Also Read :Vijayasai Reddy : వాళ్ల వల్లే నాకు, జగన్‌కు విభేదాలు.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సౌందర్య మరణం గురించి.. 

నటి  సౌందర్య(Actress Soundarya) బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి 2004 ఏప్రిల్ 17న సెస్నా 180 హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి కరీంనగర్‌కు బయలుదేరారు. ఆ హెలికాప్టర్‌లో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, బీజేపీ కార్యకర్త రమేష్ కదమ్‌ ఉన్నారు.  ఇందుకోసం ఆ రోజు ఉదయం 11.05 నిమిషాలకు జక్కూర్ లోని ఎయిర్ స్ట్రిప్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అయింది.  కొన్ని నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి హెలికాప్టర్ వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాప్టర్‌లో మంటలు వచ్చాయి. కొన్ని క్షణాలకే అది చక్కర్లు కొడుతూ నేలపై పడింది. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ కాలి బూడిదయ్యారు.

  Last Updated: 12 Mar 2025, 05:33 PM IST