Site icon HashtagU Telugu

Kannappa : ప్రభాస్ ను నమ్ముకున్న కన్నప్ప

Prabhas Kannappa

Prabhas Kannappa

‘కన్నప్ప’ (Kannappa)చిత్రం మంచు విష్ణు (Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మధుబాల, ముఖేశ్ రిషి, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ లెజెండరీ కథకు తగినట్టే భారీ తారాగణం ఎంచుకున్నారు. కానీ అందరిలోనూ ప్రేక్షకుల దృష్టి మాత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పైనే ఉంది. టీజర్‌లో ప్రభాస్ పాత్రకి మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించడంతో, సినిమాలో కూడా దాదాపు అరగంట పాటు ఆయన పాత్ర ఉంటుందని సమాచారం.

Rahul Gandhi : ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు..విద్యార్థుల సాధికారతకు చిహ్నం: రాహుల్‌ గాంధీ

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు ప్రభాస్ హాజరవుతారా లేదా అన్న దానిపై అభిమానులలో ఆసక్తి పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో కూడా “ప్రభాస్ వస్తారా?” అంటూ పోస్టులు వస్తున్నాయి. మోహన్‌బాబు స్వయంగా ఫోన్ చేసి ప్రభాస్‌ను ఆహ్వానించారని టాక్ ఉంది. మోహన్‌బాబుకి ఉన్న గౌరవం వల్లే ప్రభాస్ ఈ సినిమాలో భాగమయ్యారని ఇటీవల మోహన్‌బాబుతో మాట్లాడినప్పుడు వెల్లడైంది. దీంతో ఈవెంట్‌కు ఆయన వస్తారన్న అంచనాలు పెరుగుతున్నాయి.

Jagan : ఎవరి తలలు నరుకుతావు? రోడ్డెక్కవ్ జాగ్రత్త ..జగన్ కు గోరంట్ల వార్నింగ్ !

ఇక ప్రభాస్ ఇటీవల ప్రజల ముందుకు చాల తక్కువగా వచ్చారు. ‘రాజాసాబ్’ టీజర్ లాంచ్‌లో కూడా ఆయన కనిపించకపోవడంతో, ‘కన్నప్ప’ ఈవెంట్‌లో వస్తారా అనే ప్రశ్న ఉత్కంఠ పెంచుతుంది. కానీ ఒకవేళ ప్రభాస్ హాజరైతే మాత్రం సినిమాకు భారీగా పబ్లిసిటీ వస్తుంది. ఆయన అభిమానులు సినిమా వైపు మరింత ఆకర్షితులవుతారు. మొత్తంగా ప్రభాస్ హాజరు ‘కన్నప్ప’ సినిమాకు ఓ బిగ్ బూస్ట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.