Director Atlee: తండ్రైన స్టార్‌ డైరెక్టర్.. శుభాకాంక్షలు తెలిపిన కీర్తి సురేష్, సమంత..!

షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ సినిమా దర్శకుడు అట్లీ (Atlee) కుమార్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య ప్రియా మోహన్‌కు మగబిడ్డ జన్మించాడు. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్త అందించారు.

  • Written By:
  • Publish Date - February 1, 2023 / 06:45 AM IST

షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ సినిమా దర్శకుడు అట్లీ (Atlee) కుమార్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య ప్రియా మోహన్‌కు మగబిడ్డ జన్మించాడు. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్త అందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక పోస్ట్ ద్వారా, అట్లీ, అతని భార్య తాము ఒక కొడుకుకు తల్లిదండ్రులు అయ్యామని చెప్పారు. ‘‘మా బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా’’ అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలో అట్లీ, అతని భార్య తమ చేతుల్లో చిన్న పిల్లల బూట్లతో పోజులివ్వడం కనిపిస్తుంది. ఈ ఫోటోకి ‘ఇట్స్ ఎ బాయ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. మరో చిత్రంలో ప్రియ, అట్లీ నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ శుభవార్తని పంచుకున్న తర్వాత అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: Gold Rates: రేటు పెరిగిన బంగారం.. వాడకం తగ్గించిన జనాలు

వారు చేసిన పోస్ట్‌పై ప్రముఖ నటి కీర్తి సురేష్ స్పందించింది. “కొత్త తల్లిదండ్రులకు చాలా అభినందనలు. దేవుడు మీ బిడ్డను ఆశీర్వదిస్తాడు. మీ ముగ్గురినీ కలవడానికి నేను వేచి ఉండలేను.” అని తెలిపింది తెలిపింది. అదే సమయంలో ఈ పోస్ట్‌పై స్పందిస్తూ సమంత కూడా ఇద్దరినీ అభినందించింది. అట్లీకి చాలా మంది అభిమానులు కూడా కామెంట్స్ ద్వారా నిరంతరం శుభాకాంక్షలు చెబుతున్నారు. అట్లీ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు తీశాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జవాన్‌లో షారుక్‌తో పాటు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నారు.