Janhvi Gym: పొట్టి దుస్తుల్లో జాన్వీ జిమ్.. చెమటలు చిందించేలా హెవీ వర్కౌట్స్!

(Janhvi Kapoor) సెక్సీ గర్ల్ మాత్రమే కాదు.. ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే బ్యూటీ కూడా.

Published By: HashtagU Telugu Desk
Janhvy

Janhvy

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సెక్సీ గర్ల్ మాత్రమే కాదు.. ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే బ్యూటీ కూడా. ఏదైనా మూవీ షూటింగ్ కు గ్యాప్ దొరికితే చాలు.. వెంటనే జిమ్ సెంటర్లో దూరిపోతూ కష్టమైన వర్కౌట్స్ చేయడానికి ఆసక్తి చూపుతుంది. ఎంతటి కష్టమైన వర్కౌట్స్ చేయడానికి చేయడానికి రెడీ అంటుంది. అందుకే జాన్వీ ఫిట్ నెస్ (Fitness), ఫిజిక్ అద్భుతంగా ఉంటుంది. జాన్వీ కి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండటానికి ఆమె ఫిజిక్ కారణమని చెప్పక తప్పదు. జాన్వీ ఏదైనా ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిందంటే నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి కూడా.

తాజాగా జాన్వీ మరోసారి తన జిమ్ (Gym) వీడియోను షేర్ చేసింది. జాన్వీ కపూర్ రాబోయే చిత్రంలో IFS అధికారిగా కనిపించబోతుంది. ఇంటెన్స్ లుక్‌ కోసమే తెగ కష్టపడుతోంది. ఆరెంజ్ కలర్ పొట్టి దుస్తుల్లో జాన్వీ మెస్మరైజ్ చేసింది. తన బాడీ షేప్ కోసం, మజిల్స్ బిల్డ్ చేయడం కోసం డిఫరెంట్స్ వర్కవుట్స్ చేయడం వీడియోలో చూడొచ్చు. జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి “లవ్ ఎ గుడ్ పిలేట్స్ శేష్ 💕” అని క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం జాన్వీ జిమ్ వీడియో సోషల్ మీడియా చక్కర్లు (Viral) కొడుతోంది. వావ్ జాన్వీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె బిగుతైన అందాలకు మాత్రమే కాకుండా వర్కౌట్స్ కు ఫిదా అవుతున్నారు. నీ మోటివేషన్ చాలా బాగుంది అని మరి కొందరు రియాక్ట్ అవుతున్నారు. కాగా జాన్వీ కపూర్ ధడక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె రూహి, గుడ్ లక్ జెర్రీ, అనేక ఇతర చిత్రాలలో నటించింది. గుంజన్ సక్సేనా చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ నటి టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తోంది.

Also Read: Niharika Konidela: బెడ్ పై ఒకరు, హెడ్ లో మరొకరు.. నెట్టింట్లో నిహారిక డైలాగ్స్ వైరల్

  Last Updated: 10 May 2023, 05:51 PM IST